మొన్న సంక్రాంతికి రిలీజై నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డు సృష్టించిన అల.. వైకుంఠపురములో సినిమాకు తమిళ్, హిందీ నుంచి ఫ్యాన్సీ రైట్స్ వచ్చాయి. తెలుగు సినిమాలకు ఈ విధంగా మంచి రేట్లు రావడం శుభపరిణామం. అయితే.. ఆయా భాషల్లో హిట్ అయిన్ సినిమాలను పరభాషల్లో రీమేక్ చేసేటప్పుడు సినిమా కంటెంట్ కు తగ్గ హీరోను సెలక్ట్ చేసుకోవడం కూడా ముఖ్యమే. ప్రస్తుతం అల.. వైకుంఠపురములో సినిమాకు హిందీలో షాహిద్ కపూర్ దాదాపు కన్ఫర్మ్ అయ్యాడు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా తమిళ్ లోనే హీరో రాంగ్ చాయిస్ అంటున్నారు.

 

 

తమిళ పరిశ్రమలో ఉన్న యంగ్ హీరోల్లో శివ కార్తికేయన్ కు క్రేజ్ ఉంది. అయితే.. అల.. వైకుంఠపురములో సినిమా రేంజ్ కు తగ్గ హీరో చాయిస్ కాదని అంటున్నారు. తెలుగులో బన్నీకి స్టార్ ఇమేజ్ ఉంది. బన్నీతో పోలిస్తే తమిళ్ లో శివ కార్తికేయన్ కు అంత మార్కెట్ లేదు. పైగా ప్రస్తుతం శివ కార్తికేయన్ ఫ్లాపుల్లో ఉన్నాడు. కాబట్టి సినిమా కంటెంట్ పై కానీ, సినిమా బిజినెస్ లో కానీ శివ కార్తికేయన్ ఇంపాక్ట్ పడుతుందని అంటున్నారు. అయితే.. శింబును కూడా హీరోగా తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నట్టుగా చెన్నై సమాచారం.

 

 

దబాంగ్ రీమేక్ ను తమిళ్ లో శింబు ఏమాత్రం న్యాయం చేయలేకపోవడంతో ఫ్లాప్ అయింది. కానీ.. అదే దబాంగ్ ను తెలుగులో గబ్బర్ సింగ్ గా పవన్ కల్యాణ్ పెద్ద మ్యాజిక్కే చేశాడు. అయితే మాస్ సినిమాకు సరిపోని శింబు అల.. వంటి క్లాస్ సినిమాకు న్యాయం చేస్తాడని భావిస్తున్నారు. అత్తారింటికి దారేది సినిమాను కూడా తమిళ్ లో శింబునే చేశాడు. ఆ సినిమా ఫ్లాప్. మరి.. ఈ ఇద్దరి హీరోల్లో అల..కు ఎవరు న్యాయం చేయగలరో తమిళ నిర్మాతలే తేల్చుకోవాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: