అక్కినేని ఫామిలీ నుండి వచ్చిన హీరోలకి అంత ఈజీగా స్టార్ డమ్ అంత ఈజీగా రాలేదు. అక్కినేని గారు వారసులకు వేసిన బాటలో వారి కెరీర్ కాస్త క్లిష్టంగానే నడుస్తోంది. ఏఎన్నార్ ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికీ వారికంటూ ఓ గుర్తింపు రావడానికి ఎన్నో ప్రయోగాలు చేయక తప్పట్లేదు ప్రయోగాలు చేసినవాళ్ళే ఇండస్ట్రీలో నిలబడగలుగుతున్నారు . నాగార్జున దగ్గరనుండి అఖిల్ వరకు ఇప్పటివరకు ఐదుగురు హీరోలు వచ్చిన కొంతమందికి మాత్రమే స్టార్ డమ్ దక్కింది . అక్కినేని నాగార్జున తరువాత సుమంత్ ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం తెలిసిందే. సుమంత్ ఓ ఇంటర్వ్యూ లో తన ప్రస్తానం గురించి కొన్నివిషయాలు ముచ్చటించారు.

 

అయితే తన కెరీర్ ఆరోంభంలో సక్సెస్ అందుకుంటానని అనుకున్నాను కానీ ఆశ అడియాస అయ్యిందని పేర్కొన్నాడు. నా మొదటి సినిమా అప్పట్లో మంచి క్రేజ్ ఉన్న రామ్ గోపాల్ వర్మ చేయడం జరిగింది .కావున సినిమా అంతా సక్సెస్ అవుతుందని అంతా అనుకున్నాం .అదేవిధంగా సినిమా రిలీజ్ముందే మంచి టాక్ వచ్చింది కానీ సినిమా రిలీజ్ తరువాత సినిమా ప్లాప్ అవ్వడంతో కొంత నిరాశ కలిగించింది .

 

అదేవిధంగా మామయ్య నాగార్జునతో స్నేహమంటే ఇదేరా సినిమాలో మామయ్యను నేను చెంపదెబ్బ కొట్టాను అది తనకు నచ్చలేదని మరియు మామయ్య అభిమానులకు కోపం తెప్పించిందని చెప్పాడు. నాకేరీలో రెండో మిస్టేక్ ఏమిటంటే తాను పెళ్లి సంబంధం సినిమా చేయడమే అని చెప్పుకొచ్చాడు . కెరీర్ ఆరంభంలో తమ తాతయ్య చేస్తున్నాడని అందులోను రాఘవేంద్రరావు డైరెక్షన్ చేస్తున్నాడని ఆ సినిమా చేశాను తప్ప సినిమా స్టోరీ గురించి ఆలోచించలేదు . మొత్తానికి ప్రేమకథ మరియు పెళ్లి సంబంధం సినిమాలు నా కెరీర్ లో పెద్ద మిస్టేక్స్ అని చెప్పుకొచ్చాడు 

మరింత సమాచారం తెలుసుకోండి: