బాలయ్యది ఒక స్టైల్. మహేష్ బాబుది మరో స్టైల్. అయితే ఇద్దరికీ  కొన్ని పోలికలు ఉన్నాయి. అవేంటీ అంటే ఇద్దరూ నట వారసులే. ఒకరు మహా నటుడు ఎన్టీయార్ వారసుడు, మరొకరు సాహసాల నటశేఖరుడు క్రిష్ణ వారసుడు ఇక్కడే మరో పోలిక కూడా ఉంది. ఇద్దరూ వారి కుటుంబాల్లో చిన్న కుమారులే. 

 

అన్నయ్యలు సినిమాలపరంగా నిలదొక్కుకోలేక ఫెయిల్ అయ్యాక వచ్చిన తమ్ముళ్ళు ఈ హీరోలు ఈ ఇద్దరూ. తమ స్టామినా చూపించి సూపర్ హీరోలుగా దశాబ్దాలుగా రాణిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే బాలయ్యని మహేష్ కాపీ కొట్టడం ఏంటి అన్న ప్రశ్న వస్తోంది కదా.

 

అదేనండీ బాలక్రిష్ణ సినిమా అప్పట్లో అంటే మూడున్నర దశాబ్దాలక్రితం  జననీ జన్మభూమి అని ఒకటి వచ్చింది. ఆ మూవీకి కళా తపస్వి కె విశ్వనాధ్ డైరెక్టర్. ఆ మూవీ లో బాలయ్యది శ్రీమంతుడి రోల్. విదేశాల నుంచి వచ్చి విలాస జీవితానికి స్వస్తి పలికి పల్లెలకు వెళ్ళి అక్కడ సేవ చేయడం. పల్లెల్లోనే అందం ఉంది, అక్కడే భారత దేశం ఉంది అని చెప్పే సందేశం. అలాగే సంపద మన దగ్గర ఉంచుకోవడం కాదు, పేదలకు సేవ చేయాలి అని చెప్పే మంచి సందేశాత్మక చిత్రం.

 

నిజంగా ఈ మూవీ ఆడలేదు కానీ మంచి కాన్సెప్ట్. దాన్ని సేమ్ టూ సేమ్ మక్కీక్కి మక్కీ కాపీ కొట్టారా అన్నట్లుగా కొరటాల శివ  2015లో శ్రీమంతుడు మూవీ తీశారు. ఈ మూవీలో కూడా బాలయ్య క్యారక్టర్ మాదిరిగానే మహేష్ సేమ్  టూ సేమ్ శ్రీమంతుడు అవతరం ఎత్తేశాడు.

 

మనదగ్గర ఉంచుకుంటే లావు అయిపోతాం.సాయం చేయాల్సిందే అంటూ క్యాచీ డైలాగులు, ఈనాటి ట్రెండ్ కి తగినట్లుగా సినిమా తీసి భారీ హిట్ కొట్టారు. మొత్తానికి బాలయ్యకు రావాల్సిన హిట్ మహేష్ కి దక్కింది. చెప్పాలంటే జననీ జన్మ భూమి సినిమాలో పాటలు బాగుంటాయి.బాలయ్య నుంచి మంచి యాక్టింగును రాబట్టుకున్నారు విశ్వనాధ్. పల్లెల అందాలు కూడా చూపించారు.

 

చాలా మందికి తెలిసో తెలియదో కానీ ఈ మూవీలో ఘల్లు ఘల్లున కాలి అందెలు మోగ అంటూ బాలయ్య రాజ్యలక్ష్మిల సాంగు అప్పటికీ, ఇప్పటికీ పెద్ద హిట్. ఏది ఏమినా చక్రం తిరిగినట్లుగా పాత కధలే మళ్ళీ మళ్ళీ తీస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: