కరోనా కారణంగా ప్రపంచ దేశాలు లాక్ డౌన్ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఉన్నత విద్య కోసం, వ్యాపారం కోసం, ఉద్యోగం కోసం, హాలిడే కోసం.. ఇతర దేశాలకు వెళ్లిన చాలా మంది తమ స్వదేశాలకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి.మనదేశంలో మర్చి 25 నుండి లాక్ డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే తమిళనాట హీరో తలే విజయ్ కుమారుడు జాన్సన్ సంజయ్ స్వదేశంలో స్కూల్ విద్యను పూర్తి చేసుకొని ఉన్నత విద్య కోసం కెనడాకు వెళ్ళాడు.

 

లాక్ డౌన్ కారణంగా విమాన సర్వీస్ లు నిలిచిపోవడం తో చేసేది ఏమిలేక సంజయ్ కెనడాలోని ఉండిపోయాడు. కెనడా లో పెద్దగా కరోనా కేసులు లేనప్పటికీ పక్క దేశాలలో కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తూ ఉండడంతో హీరో విజయ్ ఆందోళన చెందుతున్నాడు. హీరో విజయ్ తన సతీమణి సంగీత, కుమార్తె దివ్య సాషాలతో కలిసి చెన్నైలోని ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్డులో ఉన్న తన నివాసంలో ఉంటున్నాడు. సంజయ్ తో విజయ్ మరియు కుటుంబ సభ్యలు ఫోన్ లో యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. విజయ్ కొరోనా కారణంగా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే సేఫ్ గా ఉండమని కొడుకుతో చెప్పినట్లు సమాచారం 

మరింత సమాచారం తెలుసుకోండి: