తన బికినీ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాని షేక్ చేసే బాలీవుడ్ భామ ఊర్వశి రౌతులా.. లాక్ డౌన్ స్పెషల్ గా కొద్దిరోజులుగా స్పెషల్ బికినీ ట్రీట్ ఇస్తున్నా లేటెస్ట్ గా అమ్మడు మరో స్పెషల్ అప్పియరెన్స్ తో షాక్ ఇచ్చింది. టూ పీస్ బికినీ తప్ప ఒంటి మీద నిండా బట్టలు ఉండటం అసలేమాత్రం ఇష్టం ఉండనట్టు కనిపించే ఊర్వశి రౌతులా లేటెస్ట్ గా నిండుగా శారీ కట్టుకుని కనిపించింది. పద్ధతిగా శారీలో కనిపిస్తే అంత ఆశ్చర్యపడటం ఎందుకు అనుకోవచ్చు.. ఎప్పుడు బికినీ లుక్ లో కనిపించే ఊర్వశి ఇలా సడెన్ గా శారీ లుక్ లో సర్ ప్రయిజ్ చేసింది. 

 

వారంలో రెండు సార్లు తన హాట్ హాట్ ఫోటో షూట్స్ తో కనిపించి సోషల్ మీడియాని షేక్ చేసే ఊర్వశి లేటెస్ట్ శారీ పిక్స్ తో తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కు భలే షాక్ ఇచ్చింది. లాక్ డౌన్ టైంలో కొత్తగా ట్రై చేయాలని అనుకుంది కాబోలు అందుకే ఈ హోమ్లీ లుక్ ని ప్రయత్నించింది. ముద్దుగుమ్మ ఎలా ఉన్నా అదిరిపోతోంది. ఈమధ్యనే మై క్వారెంటైన్ హెయిర్ అంటూ చంద్రముఖిలా కనిపించి షాక్ ఇచ్చిన ఊర్వశి లేటెస్ట్ పిక్ లో శారీ లుక్ లో సింపుల్ గా అలరించింది.  

 

తనకు వచ్చిన ఎలాంటి ఆఫర్ అయినా దానికి పూర్తిగా తన హాట్ షోతో న్యాయం చేసే ఊర్వశికి సౌత్ సినిమా ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. సుకుమార్, అల్లు అర్జున్ కలిసి చేస్తున్న పుష్ప సినిమాలో స్పెషల్ ఐటం సాంగ్ కు ఊర్వశిని తీసుకోవాలని చూస్తున్నారు మేకర్స్. ఊర్వశి కనుక ఈ సాంగ్ చేస్తే టాలీవుడ్ దద్దరిల్లిపోవడం ఖాయం. అదరగొట్టే అందాలు తన సొంతం అయినప్పుడు అలాంటి హీరోయిన్స్ కు టాలీవుడ్ లో మంచి ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి తెలుగులో అమ్మడు ఎంట్రీ ఇస్తే మంచి అవకాశాలు అందుకుంటుందని చెప్పొచ్చు. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

मोहब्बत में बस नहीं चलता . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . #love #UrvashiRautela

A post shared by urvashi rautela 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

మరింత సమాచారం తెలుసుకోండి: