ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. చిన్న హీరోలు పెద్ద హీరోలు అనే తేడా లేకుండా ఈ సినిమాలు చేస్తున్నారు. అగ్ర హీరోలు అయితే మార్కెట్ ని దృష్టి లో పెట్టుకుని చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ ఇప్పటికే ఈ ప్రయత్నం చేసి విజయవంతం కూడా అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఫ్యామిలీ ఈ ప్రయత్నం చేస్తుంది/. రానా వెంకటేష్ ఫ్యామిలీ సినిమా చేసే యోచనలో ఉన్నారు. గతంలో రానా సినిమాలో వెంకటేష్ ఒక సాంగ్ లో కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నమే ఒకటి చేస్తున్నాడని సమాచారం. 

 

ఒక కీలక పాత్ర కోసం రానా తన సినిమాలో వెంకటేష్ ని అడిగినట్టు సమాచారం. రానా అడగడం తో వెంకటేష్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. తన తాత జీవిత కథ ఆధారంగా ఒక సినిమాను కూడా రానా ప్లాన్ చేసాడు. దానికి వెంకటేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ ఇప్పుడు తమ సినిమాల్లో మరో మెగా హీరోని పెట్టుకునే విధంగా సినిమాలు చేస్తుంది. రామ్ చరణ్ చిరంజీవి ఇద్దరు కూడా దీన్ని ఎక్కువగా ఫాలో అవుతున్నారు. 

 

ఇప్పుడు వెంకటేష్ ఫ్యామిలీ కూడా ఇదే ప్రయత్నం లో ఉంది. రానా ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో నటిస్తుండగా వెంకటేష్ నారప్ప అనే సినిమా చేస్తున్నాడు. నారప్ప సినిమా తమిళ రీమేక్. ఈ సినిమా షూటింగ్ కూడా ఈ ఏడాది మొదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మరో పెద్ద సినిమాకు వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే నాగ చైతన్య వెంకటేష్ కలిసి ఒక సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మంచి హిట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: