టాలీవుడ్ లో ఇప్పుడు విలన్ గా ఇతర పాత్రలకు కీలక నటుడిగా జగపతి బాబు హవా ఎక్కువగా నడుస్తుంది. జగపతి బాబు సినిమాలో ఉంటే సూపర్ హిట్ అవుతుంది అనే భావనలో ఉన్నారు దర్శకులు నటులు. ఆయన కీలక పాత్రలు చేసిన సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అందుకే అగ్ర దర్శకులు ఆయన్ను తమ సినిమాల్లో ఉండాలని కోరుతున్నారు. ప్రస్తుతం జగపతి బాబు ఇతర భాషల్లో కూడా సినిమాలను చేస్తున్నారు. అలాగే తెలుగులో కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. 

 

ప్రస్తుతం జగ్గుబాయ్ తో సినిమా చేయడానికి గానూ యువ హీరో విజయ్ దేవరకొండ ప్రయత్నాలు చేస్తున్నాడు. తన సినిమాలో విలన్ గా జగ్గు భాయ్ ని అడిగినట్టు సమాచారం. ఆ సినిమా ఏదీ అనేది స్పష్టంగా తెలియకపోయినా అది వచ్చే ఏడాది విడుదల అయ్యే సినిమా అంటున్నారు. అగ్ర దర్శకుడి తో ఒక సినిమా విఅయ్ చేస్తున్నాడని ఆ సినిమాలో విలన్ గా జగపతి బాబు అయితే బాగుంటుంది అనే భావన లో ఉండే అడిగినట్టు సమాచారం. జగ్గు భాయ్ కూడా ఆలోచించి చెప్తాను అన్నట్టు సమాచారం. మరి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందో లేదో స్పష్టంగా తెలియదు. 

 

కాని సినిమా సెట్స్ మీదకు వెళ్తే మాత్రం జగ్గు భాయ్ ని కచ్చితంగా తీసుకోవాలి అని భావిస్తున్నాడు. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా అపడింది. వచ్చే ఏడాది సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది. మరి ఈ సినిమా తర్వాత ఆ సినిమా ఉంటుందా లేక ఈ సినిమా చేస్తూనే ఆ సినిమా చేస్తాడా అనేది మాత్రం స్పష్టంగా తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: