టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఈ ముగ్గురు హీరోలు కూడా ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంతో గొప్ప పేరుతో అగ్ర కథానాయకులుగా కొనసాగుతున్నారు. కాగా నేడు ఈ ముగ్గురు హీరోల అభిమానులకు సంబంధించి నేడు పండగ రోజు అనే చెప్పాలి. సరిగ్గా ఇరవై ఏళ్ళ క్రితం ఇదే రోజున సూపర్ స్టార్ మహేష్ బాబు రెండవ సినిమా యువరాజు, తొమ్మిదేళ్ల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన తీన్ మార్, అలానే ఇరవైనాలుగేళ్ల క్రితం యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలనటుడి తొలిసారిగా తెరముందు కనబడిన బాల రామాయణం సినిమాలు రిలీజ్ అయ్యాయి. 

 

IHG

ముందుగా మహేష్ నటించిన యువ రాజు సినిమాకు వై వి ఎస్ చౌదరి దర్శకత్వం వహించగా సిమ్రాన్, సాక్షి శివానంద్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు, ఒక బిడ్డకు తండ్రిగా నటించి, రెండవ సినిమాతోనే పెద్ద సాహసం చేయడం విశేషం. అప్పట్లో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుని మహేష్ కు మంచి పేరు తెచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జయంత్ దర్శకత్వంలో వచ్చిన తీన్ మార్ సినిమాలో, అర్జున్ పాల్వాయి, మైఖేల్ వేలాయుధం అనే రెండు రకాల విభిన్న పాత్రల్లో కనిపిస్తారు పవన్. ఈ సినిమాలో కృతి కర్బందా, త్రిష హీరోయిన్లుగా నటించారు. రెండు కాలాలకు చెందిన ఇద్దరు యువకుల కథగా తెరకెక్కిన ఈ సినిమా పర్వాలేదనిపించే విజయాన్ని అందుకుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తొలిసారిగా సినిమా తెరపై బాలనటుడిగా దర్శనమిచ్చిన సినిమా బాల రామాయణం. 

IHG

 

డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని శబ్దాలయ థియేటర్స్ వారు నిర్మించడం జరిగింది. బాల రాముడిగా జూనియర్ ఎన్టీఆర్, బాల సీతగా స్మితా మాధవ్ నటించడం జరిగింది. అప్పట్లో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుని బాలనటుడిగా ఎన్టీఆర్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. కాగా నేడు ఈ మూడు సినిమాల వేడుకలను ఆయా హీరోల అభిమానులు ఎంతో సంబరంగా పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్రెండ్స్ క్రియేట్ చేస్తూ, సందడి చేయడం తో పాటు ఆ సినిమాల యూనిట్ వారికి, అలానే తమ తమ హీరోలకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ జరుపుకుంటున్నారు......!!

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: