టాలీవుడ్ అభిమానులు పాపం అని అనే హీరో అఖిల్. ప్రముఖ కుటుంబ౦ నుంచి వచ్చినా సరే సరైన హిట్ మాత్రం అఖిల్ ఇప్పటి వరకు కొట్టలేదు. నాలుగు సినిమాలు చేసినా సరే ఒక్కటి అంటే ఒక్క సినిమా కూడా సరిగా ఆడిన పరిస్థితి లేదు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అఖిల్ విషయంలో తండ్రి నాగార్జున ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే అఖిల్ మాత్రం ట్రాక్ లోకి రావడం లేదు. కథల ఎంపిక  విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం తోనే అఖిల్ కి మంచి హిట్ రావడం లేదు అనేది టాలీవుడ్ జనాల మాట. అఖిల్ ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాడు. 

 

వచ్చే ఏడాది రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. ఆ సినిమాలు కూడా నాగార్జున్ ఓకే చేసిన తర్వాత మాత్రమే చేసే అవకాశం ఉంది. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు తాను చేస్తున్న సినిమాలో సమంతా ను నటించాలి అని అఖిల్ కోరినట్టు టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఆ సినిమాలో తన వదిన నటించాలి అని అఖిల్ తండ్రికి చెప్పగా నాగ్ కూడా ఓకే అన్నట్టు సమాచారం. సమంతా ఇప్పుడు అవసరం అయితేనే సినిమాలు చెయ్యాలి అని భావిస్తుంది గాని వరుసగా సినిమాలు చెయ్యాలి అని చూడటం లేదు. 

 

ఈ నేపధ్యంలోనే అఖిల్ ఆమెను సినిమా అడిగినట్టు సమాచారం. వచ్చే ఏడాది ప్రస్తుతం చేస్తున్న సినిమాలో ఆమె కనపడుతుంది. ఆ సినిమాలో ఒక స్పెషల్ సీన్ కి గానూ ఆమెను అడిగినట్టు తెలుస్తుంది. ఈ సినిమా మీద అఖిల్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. అది హిట్ అయితేనే అతని కెరీర్ గాడిలో పడుతుంది. లేకపోతే మాత్రం అతని తో సినిమా చేయడానికి ఎవరూ కూడా ముందుకి వచ్చే పరిస్థితి దాదాపుగా ఉండే పరిస్థితి ఉండదు అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: