నాన్నకు ప్రేమతో మూవీ తీసిన యంగ్ టైగర్ ఇప్పుడు నిజంగానే తన తండ్రి మీదున్న ప్రేమను ప్రకటించబోతున్నాడు. తండ్రి హరికృష్ణ విషయంలో ఎన్టీఆర్ వెరీ ఎమోషన్ అనే విషయం తెలిసిందే. ఫాదర్ మీద ఉన్న ప్రేమకు కృతజ్ఞత చెప్పబోతున్నాడు. 

 

హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ని కెరీర్ స్టార్టింగ్ లో పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఈ తండ్రీ కొడుకుల మధ్య బలమైన బంధం ఏర్పడింది. హరికృష్ణ ఏమో కానీ యంగ్ టైగర్ మాత్రం సందర్భం వచ్చిన ప్రతీసారి తనకున్న ప్రేమను, ఎమోషన్ ను పబ్లిక్ గానే ఓపెన్ అయ్యేవాడు. అంతేకాదు హరికృష్ణ మరణం తర్వాత అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తారక్, హరికృష్ణను తలచుకొని కన్నీరుమున్నీరైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ తండ్రిపై తన ప్రేమను మరోసారి చాటుకోబోతున్నాడు. 

 

జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ పేరు మీద బ్యానర్ స్టార్ట్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ విధంగా తన తండ్రిపై ఉన్న అమితమైన ప్రేమను చాటుకోబోతున్నాడట. తాజా సమాచారం ప్రకారం ఎన్.హెచ్.కె ఆర్ట్స్ మీద హోం బ్యానర్ ప్లాన్ చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ లో ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ తో నటించబోయే సినిమా తర్వాత ఈ బ్యానర్ ఓపెనింగ్ ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ బ్యానర్ కు సంబంధించిన లోగోను రెడీ చేయిస్తున్నట్టు తెలుస్తోంది. 

 

రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ సినిమాను హారిక, హాసిని క్రియేషన్స్ తో పాటు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ సినిమా తర్వాత నటించబోయే 31వ సినిమాను తారక్, హరికృష్ణ బ్యానర్ మీద ప్లాన్ చేస్తున్నాడట. తను నటించబోయే ప్రతి సినిమాలో ఎన్టీఆర్ భాగస్వామి కావాలనే ఉద్దేశంతోనే బ్యానర్ స్టార్ట్ చేయబోతున్నట్టు వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: