సమ్మర్ సీజన్ చాలా పెద్దది. నిజానికి నాలుగు సంక్రాంతులు, మరో నాలుగు దసరాలు కలిపితే ఎంతో అంత స్పాన్ ఒక్క సమ్మర్ కే ఉంది. కనీసం రెండు నెలలు సెలవులు.జనాలు మంచి మూడ్ లో ఉంటారు. అపుడు ఎంటర్టైమెంట్ కి ప్రయారిటీ ఇస్తారు.

 

ఆ విధంగా ఆలోచించే ప్రతీ ఏడాది సమ్మర్ కి సినిమాలు రెడీ చేసి పెట్టుకుంటారు. ఈసారి కూడా వందల కోట్లతో తయారు అయిన రెండు పదుల వరకూ సమ్మార్ సినిమాలు క్యూ కట్టాయి.

 

అయితే అనుకోని ఉపద్రవంలా కరోనా ముప్పు వచ్చిపడింది. దాంతో సమ్మర్ సీజన్ సగం పోయిందనుకుంటే ఇపుడు మే వరకూ లాక్ డౌన్ పొడిగించడం వల్ల సమ్మర్ మొత్తం పోయినట్లేనని అంటున్నారు. రేపటి రోజున లాక్ డౌన్ కి శడలింపు ఇచ్చినా కూడా సినిమా హాళ్ళు అంత తొందరగా ఓపెన్ చేయించరని కూడా టాలీవుడ్ అంచనా వేస్తోంది.

 

అన్నీ అనుకూలిస్తే ఏ జూన్ తరువాతనో సినిమా హాళ్ళు రీ ఓపెన్ అవుతాయి. అప్పటికి మొత్తం సమ్మర్ సీజన్ ముగుస్తుంది. దాంతో ఏం చేయాలో తెలియక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారుట. ఏది ఏమైనా సరే సినిమాలకు ఇది కాని కాలమైపోయింది.

 

భయం గుప్పిట్లో జనం ఉన్నారు. దాంతో మళ్ళీ మంచి రోజులు ఎపుడు వస్తాయో అని  టాలీవుడ్ ఆశగా ఎదురుచూస్తోంది. ఇప్పటికైతే చిన్నా పెద్దా సినిమాలు అన్నీ కలుపుకుని చాలానే ఉన్నాయి.

 

ఇందులో అప్ కమింగ్ హీరోలు, కొత్త వారు, మిడిల్ ఏజ్ గ్రూప్ హీరోలు, చిన్న సినిమాలు ఎక్కువగా ఉన్నాయి.ఎందుకంటే సంక్రాంతి, దసరా పెద్ద హీరోలు టార్గెట్ చేస్తున్నారని చిన్న హీరోలు ఇపుడు సమ్మర్ ని నమ్ముకుంటే అదే అతి పెద్ద మోసం చేసిందని తెగ ఫీల్ అవుతున్నారు. ఓ విధంగా చెప్పాలంటే బావురుమంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: