'బాహుబలి' సినిమా విజయంతో దేశ స్థాయిలో మాత్రమే కాక అంతర్జాతీయ స్థాయి లో పాపులర్ అయిపోయాడు రాజమౌళి. ఒకానొక కాలంలో భారతదేశ చలనచిత్ర రంగం గురించి మాట్లాడుకునే పరిస్థితి ప్రపంచంలో ఉన్న సినిమా రంగానికి వచ్చిన సందర్భంలో బాలీవుడ్ గురించి మాట్లాడుకునే వారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. 'బాహుబలి' ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడైతే బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అప్పటినుండి రాజమౌళి గురించి మాట్లాడుకుంటున్నారు. బాహుబలి తర్వాత ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా 'RRR'. కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో సినిమా షూటింగ్ ఆగిపోవటం తో రాజమౌళి ఇంటికే పరిమితమయ్యారు.

 

ఇటువంటి తరుణంలో లాక్ డౌన్ లో కూడా వండర్స్ క్రియేట్ చేయటానికి తన సత్తా చూపించడానికి రాజమౌళి రెడీ అవుతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. పూర్తి మేటర్ లోకి వెళ్తే  వచ్చే నెల 20వ తారీఖున ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా 'RRR' సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ కి సంబంధించి వీడియో రిలీజ్ చేయడానికి రాజమౌళి బాగా హోంవర్క్ చేస్తున్నారట. ఈ వీడియో ఓ రేంజ్ లో ఉండాలని తన దృష్టి మొత్తం పూర్తిగా ఎన్టీఆర్ వీడియో పై పెట్టారట. దీంతో వచ్చే నెల 20వ తారీఖున ఈ వీడియో రిలీజ్ చేయనున్నారు.

 

ఎన్టీఆర్‌ ఈ చిత్రంలో 'కొమురం భీమ్'‌ పాత్రను చేస్తున్నాడు. ఇదే సమయంలో ఎన్టీఆర్‌ దొంగగా కూడా కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. చరణ్‌ పోలీస్‌ అంటూ ఇప్పటికే ఆయన పుట్టిన రోజుకు విడుదల అయిన వీడియోలో తేలిపోయింది. ఇక ఎన్టీఆర్‌ పాత్రపై పూర్తి క్లారిటీ రావాలి అంటే ఆయన బర్త్‌డే వరకు వెయిట్‌ చేయాల్సిందే. చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన వీడియోలో చరణ్ బాడీ మరియు ఎన్టీఆర్ వాయిస్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో ఎన్టీఆర్ వీడియో ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ అటు మెగాభిమానుల లోనూ ఇటు నందమూరి అభిమానులలో నెలకొంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: