సినిమా పరిశ్రమకు వచ్చిన తరువాత ముందుగా అవకాశాలు వెనువెంటనే వచ్చే పరిస్థితులు సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికే కొంత వరకు ఉంటుందని, అయితే ఎవరైతే పెద్దగా సినీ ఫీల్డ్ తో పరిచయాలు లేనివారు ఉంటారో, అటువంటి వారు మాత్రం కష్టపడి మెల్లగా అవకాశాలు అందుకుని పైకి రావడం జరుగుతుందని అంటున్నారు విశ్లేషకులు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది కొంత కష్టమే అయినప్పటికి కష్టపడితే సాధ్యం కానిది ఏది లేదని ఇప్పటికే ఎందరో గొప్ప గొప్ప నటీనటులు నిరూపించడం జరిగింది. ఇక ఆ విధంగా ముందుగా మెల్లగా అవకాశాలు అందుకుని, ఆపై మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకుని మంచి హోదా రాగానే, కొందరు ఎంత ఎదిగినా వొదిగి ఉండడంతో పాటు తమ మూలాలు ఎప్పటికీ మరిచిపోరని, అయితే మరికొందరు మాత్రం కళ్ళు నెత్తికెక్కి తమకు నచ్చిన విధంగా ముందుకు నడిచే వారు సినిమా ఇండస్ట్రీలో అక్కడక్కడా ఉన్నారని అంటున్నారు సినీ విశ్లేషకులు. 

 

ముందుగా మలయాళ సినిమాల్లో, ఆపై తమిళ, తెలుగు చిత్ర సీమల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఒక హీరోయిన్, ఆపై మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలతో మంచి విజయాలు అందుకుని ప్రస్తుతం మంచి స్టార్ హీరోయిన్ స్టేటస్ కు ఎదిగింది. అయితే రాను రాను ఆమెకు పేరు పెరుగుతున్న కొద్దీ, ఆమె వ్యవహార శైలిలో చాలామార్పులు రావడం జరిగిందని, ఆమెతో వేగలేక చస్తున్నాం అంటూ ఇటీవల  కొందరు నిర్మాతలు నెత్తి, నోరు కొట్టుకున్నారట. ఇక సదరు హీరోయిన్ గారితో ఒక సినిమా చేస్తే తమకు కూడా మంచి పేరు లభిస్తుందని భావిస్తున్న కొందరు నిర్మాతలు, ఆమెకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వవలసి వచ్చినప్పటికీ కూడా కొందరు బడా హీరోల సినిమాల్లో ఆమెనే హీరోయిన్ గా తీసుకుంటున్నారట. 

 

అయితే రాను రాను ఏకు మేకైనట్లుగా, సినిమాలో తన క్యారెక్టర్ కు మంచి ప్రాధాన్యత ఉండాలని, ఎక్స్ పోజింగ్ చేయనని, వెకిలి చేష్టలు చేసే సన్నివేశాల్లో నటించలేనని, తనకు కుదరని రోజున షూటింగ్ కి రాలేనని, మరీ ముఖ్యంగా సినిమా ప్రమోషన్స్, పబ్లిసిటి కార్యక్రమాలకు అయితే హాజరయ్యేది లేదంటూ విపరీతమైన కండీషన్లు పెడుతూ నిర్మాతల పాలిటి సమస్య గారి మారిన ఆ హీరోయిన్, ఇటీవల కొద్దిరోజుల క్రితం తనకు వరుసగా పెద్ద సక్సెస్ లు దక్కకపోవడంతో తన పద్ధతి మార్చుకుని పూర్వం మాదిరిగానే నిర్మాతలు చెప్పినట్లు చేయడానికి ఒప్పుకుందట. సడన్ గా ఏమయిందో ఏమో తెలియదు గాని ఆ హీరోయిన్ గారు మళ్ళి నిర్మాతల మాటను పూర్తిగా పెడచెవిన పెట్టి తన త్రోవలో తాను నడుస్తోందట. ఆమె వైఖరి చూసి పూర్తిగా విసిగి వేసారి పోయిన కొందరు నిర్మాతలు అయితే, కుక్కతోక వంకరైనా తీయగలమేమో గాని, ఆమెగారు మారడం కానీ, ఆమెను మార్చడం కానీ జరగని పనిరా దేవుడా అంటూ తప్పక సర్దుకుపోతున్నారట....!!

మరింత సమాచారం తెలుసుకోండి: