బుల్లితెర మీద హాట్ కపుల్స్ ఎవరిది అంటే అది సుడిగాలి సుధీర్, రష్మిలదే అని క్షణం ఆలోచించకుండా చెప్పేస్తారు. వాళ్ళు నటిస్తూ ప్రేమించుకుంటున్నారో.. ప్రేమించడం నటిస్తున్నారో.. ఏమి అర్ధం కాదు కానీ వాళ్లిద్దరూ వస్తే మాత్రం అది ఎలాంటి షో అయినా సూపర్ హిట్ అవ్వాల్సిందే. ఏడేళ్లుగా వీరి కాంబో సూపర్ హిట్ అవుతూ వచ్చింది. సుధీర్ ఆన్ లైన్ లోకి వస్తే రష్మీ గురించి.. రష్మీ వస్తే సుధీర్ గురించి అడగడం కామన్ గా మారింది. ఈ ఇద్దరిలో ఎవరు ఆన్ లైన్ చాట్ చేసినా మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటనో లేక ఒకరి మీద మరొకరి అభిప్రాయం ఏంటనే ప్రశ్నలు వేస్తారు. 

 

సుధీర్ ఏమో కానీ రష్మీ తరచూ ఆన్ ట్విట్టర్ లో తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో చాట్ చేస్తుంది. ఎప్పటిలానే ఖాళీగా ఉన్నాం కదా అని మంగళవారం కూడా ఆన్ లైన్ లో ఫ్యాన్స్ అడుగుతున్నా ప్రశ్నలకు లైవ్ లో సమాధానం చెప్పింది రష్మీ. ఎప్పటిలానే సుదీర్ గురించి చెప్పమంటే అమేజింగ్ వర్క్ విత్ అంటూ ఆన్సర్ ఇచ్చింది. సుధీర్ తో ఇంకా ఎన్నో షోలు చేస్తారని ఒకరు అడుగగా.. సుధీర్ తో నాకు ఎప్పుడైనా ఓకే అన్నారు. ఇక సుధీర్ తో కలిసి మీరు ఎప్పుడైనా ఆన్ లైన్ లోకిరావొచ్చు కదా అన్న అభిమాని ప్రశ్నకు ఈ ఆలోచన ఎప్పుడు రాలేదు. కుదిరితే వస్తాం.. నిజం చెప్పాలంటే నేను చాలా బిజీ అంటూ చెప్పుకొచ్చింది రష్మీ. 

 

సుధీర్ తో మీ రిలేషన్ గురించి తప్పుగా అనుకునే వారికి మీరు ఏమని చెబుతారు అంటే.. ఎవరి ఇష్టం వారిది.. ఎవరో ఏదో అనుకుంటారని నేను ఏ పని చేయకుండా ఆపాను అంటుంది రష్మీ.. యాక్టింగ్ కాకుండా వేరే ఏదైనా అంటే ఆ ఛాన్స్ లేదని చెప్పింది రష్మీ. మొత్తానికి రష్మీ తన ఫ్యాన్స్ తో చాటింగ్ లో సుధీర్ గురించి అమేజింగ్ అని చెప్పడం మళ్ళీ వార్తల్లో నిలిచేలా చేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: