బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరో రంగంలొకి అడుగుపెడుతున్నాడు. ఇప్పటికే వెండితెర మీద బుల్లితెర మీద సత్తా చాటుతున్న సల్మాన్ భాయ్, తాజాగా మరో రంగంలో తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. హీరోగా వరుస బ్లాక్ బస్టర్లు అందిస్తున్న సల్మాన్, బుల్లి తెర మీద బిగ్ బాస్ షోతో అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పుడు మరో ప్లాట్ ఫాంలో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు సల్మాన్. త్వరలో సొంత యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభిస్తున్నాడు సల్మాన్.
ఈ యూట్యూబ్ చానల్ ద్వారా సల్మాన్ తన సినిమాల విశేషాలు, ఇతర అప్డేట్లతో పాటు తన పర్సనల్ లైఫ్ గురించి కూడా అభిమానులతో షేర్ చేసుకోనున్నాడు సల్మాన్. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా తన ఫాం హౌస్‌లోనే ఉంటున్న సల్మాన్, అభిమానులకు కరోనా విషయంలో అవేర్నెస్ కలిగించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. 1989లో ఘన విజయం సాదించిన తన సినిమా మైనే ప్యార్ కియా లోని ఓ రొమాంటిక్ సీన్ ను కూడా కరోనా అవేర్నెస్ కోసం వినియోగించారు.
మైనే ప్యార్ కియా సినిమాలో భాగ్య శ్రీ ఓ అద్దం మీద ముద్దు పెట్టగా అక్కడ ఆమె లిప్ స్టిక్ మార్క్ ఉండిపోతుంది. తరువాత సల్మాన్ ఆ లిప్‌స్టిక్ మీద ముద్దు పెట్టుకుంటాడు. కానీ తాజాగా సల్మాన్ క్రియేట్ చేసిన వీడియోలో సల్మాన్ లిప్ స్టిక్ మార్క్ మీద ముద్దు పెట్టకుండా దాన్ని సానిటైజర్తో క్లీన్ చేస్తాడు. ఈ వీడియో క్లిప్ తో పాటు `మైనే ప్యార్ కియా ఇప్పుడు రిలీజ్ అయి ఉంటేనా అంటూ కామెంట్ చేశాడు. సల్మాన్ పోస్ట్ చేసిన ఈ వీడియోపై అభిమానుల నుంచి మంచి రెస్సాన్స్ వస్తోంది.
View this post on Instagram