కరోనా కు భయపడి సెలెబ్రెటీల నుండి సామాన్యుల వరకు తమ ఇళ్లకే పరిమితం అవుతున్న పరిస్థితులలో సెలెబ్రెటీలు అంతా సోషల్ మీడియాలో విపరీతంగా యాక్టివ్ అయిపోతున్నారు. ఇప్పటి వరకు సోషల్ మీడియా ఛాయలకు కూడ రాని చిరంజీవి ఈ కరోనా టై మ్ లో సోషల్ మీడియాలో ఎంటర్ అవ్వడమే కాకుండా ప్రతిరోజు సందర్భం బట్టి 5 ట్విట్స్ నుండి 10 ట్విట్స్ వరకు చిరంజీవి రకరకాల అంశాల పై స్పందిస్తూ తన ఖాళీని వినియోగించుకుంటున్నాడు అంటే కరోనా ఎఫెక్ట్ తో గొప్పవాళ్ళు కూడ ఎలా ఖాళీగా ఉన్నారో అర్ధం అవుతుంది. 


ఇలాంటి పరిస్థితులలో ఎప్పుడు సోషల్ మీడియాలో సందడి చేసే వెన్నెల కిషోర్ లాక్ డౌన్ మొదలైన దగ్గర నుండి మౌనముద్ర వహించడంతో వెన్నెల కిషోర్ కు ఏమైంది అంటూ అతడి అభిమానులు ఖంగారు పడుతున్నారు. అయితే ఇతడి మౌనం వెనుక ఒక టాప్ సీక్రెట్ ఉంది. తెలుస్తున్న సమాచారం మేరకు ప్రస్తుతం ఈ టాప్ కమెడియన్ ‘ఇన్నర్ ఇంజినీరింగ్’ కోర్స్ ను ఆన్ లైన్ లో చేస్తున్నట్లు సమాచారం.


విదేశాలలో చదువుకుని ఉద్యోగం చేసి వచ్చిన వెన్నెల కిషోర్ కు ఇప్పుడు ఇలా ఆన్ లైన్ కోర్స్ చేయడం ఏమిటి అని కొందరు ఆశ్చర్యపోతూ అన్వేషణ కొనసాగిస్తే ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఈ ఇన్నర్ ఇంజనీరింగ్ కోర్స్ అంటే ఒక టెక్నికల్ సబ్జెక్ట్ కాదు. మనకు మనం అంతర్ముఖంలోకి వెళ్లిపోయి మన గురించి మనం తెలుసుకుని మన ఎమోషనల్ బ్యాలెన్స్ ను మానసిక స్థితిని బ్యాలెన్స్ చేసుకునే కోర్స్. 


నిరంతరం టెన్షన్ తో కూడిన ఫిలిం ఇండస్ట్రీలో ఉండటంతో వెన్నెల కిషోర్ తన మనసు పై తాను పట్టు సాధించడానికి ఈ కోర్స్ చేస్తూ మధ్యలో ఖాళీ దొరికినప్పుడు అమెజాన్ నెట్ ఫ్లిక్స్ లలో ప్రసారం అవుతున్న వెబ్ సిరీస్ లను సినిమాలను చూస్తూ తన లాక్ డౌన్ పిరియడ్ ను ఎంతో ఉపయోగించుకుంటూ తాను భవిష్యత్ లో చేయబోయే సినిమాల పాత్రలలో వెరైటీ చూపించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: