నాచ్యులర్ స్టార్ నాని 'అష్టాచమ్మ' చిత్రం ద్వారా పరిచయమై తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న నటుడు. 'రైడ్', 'స్నేహితుడు','భీమిలీ కబడ్డీ జట్టు', అలా మొదలైంది చిత్రాల ద్వారా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత వచ్చిన ఏటో వెళ్లిపోయింది మనసు, ఈగ, మజ్ను, నేను లోకల్, ఎంసీఏ, గ్యాంగ్ లీడర్ చిత్రాలు నానిని ఒక ప్రత్యేకమైన స్టార్ గా నిలబెట్టాయి. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా మాత్రం ‘భలే భలే మగాడివోయ్’. ఈ సినిమాతోనే నాని మార్కెట్ స్థాయి కూడా పెరిగింది.

 

ఇక నాని నిర్మాతగా విశ్వక్ సేన్ హీరోగా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్’ సినిమా డీసెంట్ రివ్యూస్ తో పాటు డీసెంట్ కలెక్షన్స్ తో మంచి హిట్ అనిపించుకుంది. శైలేష్ కొలను అయితే నెక్స్ట్ ‘హిట్ 2’ తీస్తానని అంటూనే అవకాశం వస్తే నానిని కూడా డైరెక్ట్ చేస్తానని మనసులో మాటను ఇప్పటికే బయటపెట్టాడు. తన నిర్మాణంలోనే దర్శకుడిగా పరిచయమై మొదటి సినిమాతోనే ప్రూవ్ చేసుకున్న, తనతో సినిమా చేయాలని ఆశపడుతున్న శైలేష్ కొలనుకు నాని సినిమా ఇచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో ఇప్పటికే వార్తలు వచ్చాయి.

 

ఇదిలా ఉండగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం నానికి శైలేష్ ఒక లైన్ చెప్పారని.. ఫుల్ స్క్రిప్ట్ చేసుకొని రమ్మని నాని, శైలేష్ కి చెప్పినట్లు ఫిల్మ్ నగర్ టాక్. శైలేష్ స్క్రిప్ట్ నానికి నచ్చితే శైలేష్ కొలనుకు నాని ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని.. నాని లిస్ట్ లో ఈ డైరెక్టర్ పేరు కూడా ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. పైగా 'హిట్' సినిమాని చక్కగా రూపొందించి శైలేష్ కొలను ప్రేక్షకుల్లో మంచి మార్కులే తెచ్చుకున్నాడు. నాని సైతం శైలేష్ తన నమ్మకాన్ని నిలబెట్టింనందుకు సంతృప్తిగా ఉందని మీడియా సమక్షంలోనే చెప్పారు. మరి నాని శైలేష్ కు ఛాన్స్ ఇస్తాడా లేదా అనేది చూడాలి. నాని ప్రస్తుతం నటించిన 'వి' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కరోనా ఎఫెక్ట్ తగ్గిన తర్వాత ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: