టాలీవుడ్ లో సినిమాల్లోకి అడుగు పెట్టి దాదాపు 15 ఏళ్ళు దాటినా సరే వరుసగా సినిమాలు చేస్తూ ఇప్పటికి దర్శకులు సీనియర్ హీరోల పక్కన ఆలోచించే పేరు కాజల్. ఆమె వరుసగా సినిమాలు చేసినా చేయకపోయినా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అగ్ర హీరోల పక్కన ఆమె చేసిన సినిమాలే దీనికి కారణం. ఏ స్టార్ హీరో అయినా సరే నాలుగేళ్ల క్రితం వరకు ఆమెను ఎక్కువగా ఎంచుకునే వారు. సమంతా అనుష్క, కాజల్ వీరి హవా ఎక్కువగా కొనసాగుతూ ఉండేది. ఆ తర్వాత ఆమె భారీగా రేటు కూడా పెంచింది. 

 

దాదాపు అందరు హీరోలతో ఆమె సినిమాలు చేస్తూ వచ్చింది. ఇది పక్కన పెడితే ఆమెకు ప్రేమ వ్యవహారాలూ ఉన్నాయి అనే వార్త ఇప్పటి వరకు ఎక్కడా కూడా రాలేదు. టాలీవుడ్ లో అందరి తో ఆమె సన్నిహితంగా ఉన్నా సరే అమే గురించి ఒక్కటి అంటే ఒక్క వార్త కూడా ఇప్పటి వరకు టాలీవుడ్ లో బయటకు రాలేదు. అటు తమిళంలో సినిమాలు చేసినా సరే ఆమె ప్రేమ వ్యవహారాలూ అంటూ ఏ ఒక్క వార్త కూడా బయటకు రాలేదు. అసలు దీనికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియకపోయినా... 

 

అసలు విషయం మాత్రం వేరే ఉందీ అని అంటూ ఉంటారు. ఆమెకు సినిమాలు అంటే పిచ్చి అని అందుకే ఆమె ప్రేమలో పడలేదని ఆమెకు డబ్బు పిచ్చి కూడా బాగా ఉందని అందుకే ఆమె ప్రేమ వ్యవహారాల మీద అంతగా ఆసక్తి చూపించలేదు అని అంటూ ఉంటారు. ఆమెకు కొందరు ప్రపోజ్ చేసినా సరే ఆమె మాత్రం అంత ఆసక్తి చూపించలేదు అనేది కొందరి మాట. ఆమె ఒకానొక సమయంలో కొందరు హీరోయిన్ లు ప్రేమలో పడుతున్న ఇబ్బందులు చూసి అమే ప్రేమను అసలు వద్దనుకుంది అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: