బాలీవుడ్ స్టార్ వారసులు వెండితెర మీద తమ మార్క్ చూపించేందుకు చాలా కష్టపడుతున్నారు. ముఖ్యంగా చిన్నతనం నుంచి భారీకాయంతో కనిపించిన చాలా మంది తారలు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కోసం మాత్రం చాలా కష్టపడ్డారు. తెర మీద అందంగా కనిపించేందుకు స్లిమ్ అండ్ ఫిట్ లుక్‌లోకి మారిపోయి హీరో, హీరోయిన్ అంటే ఇలాగే ఉండాలనిపించేంతగా తమ మార్క్ చూపించారు.
అలా వెండితెర మీద సత్తా చాటిన బాలీవుడ్ హాట్ బ్యూటీ సారా అలీ ఖాన్. చిన్నతనంలో బొద్దుగుమ్మగా ఉన్న ఈ భామ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు చాలా కష్టపడి స్లిమ్ లుక్ లోకి మారిపోయింది. లాక్ డౌన్ కారణంగా ఈ ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్న ఈ బ్యూటీ తన పాత ఫోటోను అభిమానులతో షేర్ చేసుకుంది. తాను బొద్దుగా ఉన్నప్పటి ఫోటోతో పాటు స్లిమ్ లుక్ లోకి మారిన తరువాత ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది.
సారా ఆ ఫోటోను షేర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే వేల సంఖ్యలో షేర్లు కామెంట్లు రావటం విశేషం. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే సారా అలీ ఖాన్ ఎప్పటికప్పుడు తన అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రీమేక్‌గా తెరకెక్కుతున్న కూలీ నం 1 సినిమాలో నటిస్తోంది ఆ బ్యూటీ.