చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇపుడు దేశా దేశాలనే చుట్టేస్తోంది. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో 9,756 మంది ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. 1,305 మంది కోలుకోగా, 377 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులు 20 లక్షలకు చేరువయ్యాయి. ఈ మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1.26 లక్షలు దాటింది. నిన్న మొన్నటి వరకు యూరప్ దేశాలతోపాటు అమెరికాను కుదిపేసిన ఈ ప్రాణాంతక వైరస్ అక్కడ కొంత నెమ్మదించగా, ఇప్పుడు రష్యాను కలవరపెడుతోంది. ఇక మన దేశంలో కరోనా రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉంది. ఎంత టెక్నాలజీ అభివృద్ది ఉన్నా ఇక్కడ మాత్రం కరోనాతో విల విలలాడిపోతున్నారు.

 

తాజాగా కరోనా దెబ్బతో రైళ్లు, బస్సులు, విమానాలు  ఎక్కడక్కడి క్కడ స్థంభించిపోయాయి. కరోనా దెబ్బకు బీదా, గొప్ప, ఆడా, మగా తేడా లేకుండా అందరు బెంబేలెత్తిపోతున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో దాదాపు పరిశ్రమలు స్థంభించిపోయాయి. తాజాగా ప్రధాన మంత్రి కరోనా వైరస్ నియంత్రించేందకు దేశాన్ని మే 3 వారికి లాక్ డౌన్ లో ఉంచనున్నటు ప్రకటించారు. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి తమ సొంత ఊళ్లకు వెళ్లలేక..ఉన్న చోట ఉపాది లేక వలస కూలీలు నరకం అనుభవిస్తున్నారని కమల్ హాసన్ అన్నారు.  

 

మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడగానే పెద్ద ఎత్తున వలసకార్మికులు ముంబయిలోని బాంద్రా స్టేషన్‌ వద్ద గుమిగూడారు. ఇప్పుడు ముంబయి. వలసకార్మికుల సంక్షోభం అనేది ఒక టైమ్ బాంబ్‌ లాంటిది. అది కరోనా కంటే పెద్ద సంక్షోభం కాకముందే తగ్గించాలి. బాల్కనీ ప్రభుత్వాలు కింద కూడా ఏం జరుగుతుందో చూడాలి  అని కమల్  విరుచుకుపడ్డారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: