విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఏ పేరుకు ఏ రేంజ్‌లో క్రేజ్ ఉందో ఇప్పుడు ప్ర‌త్యేకంగా లెక్క‌లు అక్క‌ర్లేదు. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో యంగ్ హీరోలు ఎంద‌రో ఉన్న‌ప్ప‌టికీ.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే భారీగా అభిమానం సాధించిన హీరో మాత్రం విజయ్ దేవరకొండ ఒక్కడే. అర్జున్ రెడ్డి సినిమా ఎప్పుడైతే విడుద‌ల అయిందో.. అప్పుడే ఈయ‌న ఓవ‌ర్‌నైట్ స్టార్ అయిపోయారు. అర్జున్‌ రెడ్డి ఇచ్చిన క్రేజ్‌తో ఒక్కసారిగా యూత్‌ ఐకాన్‌గా మారిపోయాడు విజయ్. అంతేకాకుండా.. ఈ ఒక్క సినిమా విజ‌య్‌కు జాతీయ స్థాయిలో ఇమేజ్ అందించింది. 

 

అయితే ఆ త‌ర్వాత అర్జున్ రెడ్డి క్యారెక్ట‌ర్‌కు ఏ మాత్రం సంబంధం లేని గీత గోవిందం సినిమాలో న‌టించి హిట్ కొట్ట‌డ‌మే కాకుండా అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఇక గ‌త కొంత కాలంలో వ‌రుస ఫ్లాపులు చ‌విచూస్తున్నాడు విజ‌య్‌. అయిన‌ప్ప‌టికీ ఈయ‌న క్రేజ్ త‌గ్గ‌లేదు. అదే జోష్‌తో ముందుకు వెళ్తున్నాడు. కానీ, తాజాగా కొంద‌రు నెటిజ‌న్లు ఈ రౌడీ హీరో ప‌రువును దారుణంగా తీసేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. భారీ అంచనాల మధ్య రిలీజ్‌ అయిన విజయ్‌ దేవరకొండ ఆకరి చిత్రం వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్.  

 

క్రాంతి మాధవ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం బాక్సాఫిస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన‌ ఈ చిత్రంలో రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజాబెల్లె హీరోయిన్లుగా నటించారు. అయిన‌ప్ప‌టికీ ఈ హిట్ అవ్వ‌లేదు. అయితే ఈ సినిమా తమ ప్లాట్ ఫామ్ లోకి వచ్చిందని నెట్ ఫ్లిక్స్ వారు తాజాగా ప్ర‌కటించారు. దీంతో ఈ సినిమా చూసిన వారు ఇచ్చిన రిప్లై లు చూడాలి. 

 

సినిమా పెద్ద టార్చర్ అని ఎవరూ చూడొద్దు అంటుంటే.. అసలు ఈ సినిమా ఎందుకు తీసుకున్నారని ఏకంగా ఈ సినిమానే తీసేసి ఇంకో సినిమా తీసుకోమని అంటున్నారు. మ‌రికొంద‌రు జీవితంలోనే ఇలాంటి సినిమా చూడలేదని బ‌దులిస్తున్నారు. ఇది నిజంగా అవ‌మాన‌మే అని అంటున్నారు ఫ్యాన్స్‌. దీంతో ఈ సారి అయినా మంచి హిట్ కొట్టి వారి నోర్లను మూయించాల‌ని విజ‌య్ ఫ్యాన్స్ కోరుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: