యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ డైరెక్షన్ లో తన 30వ సినిమా చేయనున్నాడని తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో వున్న ఈ చిత్రం ఆగస్టు నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్రలో నటించడనున్నాడని వార్తలు వస్తున్నాయి. క్యాస్టింగ్ విషయంలో త్రివిక్రమ్ ప్రత్యేక ద్రుష్టి పెడతాడని తెలిసిందే. ఆర్ఆర్ఆర్ రిలీజ్ తరువాత ఎన్టీఆర్ కు పాన్ ఇండియా క్రేజ్ రావడం పక్కా కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొనే సంజయ్ దత్ ను తీసుకొని ఈ సినిమాను పాన్ ఇండియా  వైడ్ విడుదలచేయాలని సన్నాహాలు చేస్తున్నారు. 
 
అలాగే ఎన్టీఆర్ పుట్టిన రోజున ఈ సినిమా టైటిల్ ను కూడా విడుదలచేస్తారని టాక్. అయితే సంజయ్ దత్ విషయంలో కానీ టైటిల్ రిలీజ్ విషయంలో కానీ మేకర్స్ నుండి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. కాగా ఈ సినిమా కు అయినను పోయిరావలెను హస్తినకు అనే టైటిల్ ప్రచారం లో వుంది. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ల పై సూర్య దేవర నాగవంశీ , కళ్యాణ్ రామ్ సంయక్తంగా నిర్మించనునున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మే లో విడుదలకానుంది. ఇక త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ కు ఇది రెండో సినిమా. ఇంతకుముందు వీరి కాంబో లో వచ్చిన అరవింద సమేత సూపర్ హిట్ అయ్యింది. 
 
ఇదిలావుంటే ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ కు డబ్బింగ్  చెప్పే పనిలో వున్నాడు. రాజమౌళి డైరెక్షన్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో ఎన్టీఆర్ కొమురం భీం గా కనిపించనుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నాడు. ఎన్టీఆర్ బర్త్ డే రోజు ఈ సీనిమా నుండి  కొమరం భీం ఫస్ట్ లుక్ విడుదల కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: