దెయ్యాలతో ఎప్పుడూ ఏం సినిమాలు చేస్తాం అని అందరూ అనుకుంటుంటే ..అచ్చొచ్చింది కదాని అదే  దెయ్యాల్ని ఫాలో అయిపోతున్నాడు. అంతే కాదు ఈ సారి సూపర్ స్టార్ రజనీకాంత్ దెయ్యంతో సినిమా చెయ్యబోతున్నాడు ఈ హీరో డైరెక్టర్ . కొరియోగ్రాఫర్ గా కెరీర్  స్టార్ట్ చేసి హీరో గా కంటిన్యూ అయ్యి డైరెక్టర్ గా కూడా సినిమాలు చేస్తున్నాడు రాఘవ లారెన్స్ . లారెన్స్   కొన్ని సంవత్సరాల నుంచి వరుసగా హార్రర్ ఫిల్మ్ చేసతున్నాడు. ఆశ్చర్యంగా ఆ సినిమాలు కూడా ఒకదానికి మించి ఒకటి సూపర్ హిట్ అవుతున్నాయి. ఇదే సిరీస్ లు ఇంకా 20 చేస్తానని కూడా చెప్పాడు లారెన్స్ .

 

ముని సిరీస్ లో నాలుగు సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినలారెన్స్ ..శివగంగ అనే మరో హార్రర్ సినిమా కూడా చేశాడు . ముని సిరీస్ లో సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయంటే ఈ సినమా హిట్ కి సర్ ప్రైజ్ అయ్యి ఇంప్రెస్ అయిన బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా హిందీలో ఈ సినిమా చేసేంతగా. అంతేకాదు ఈ  ముని 4 బాలీవుడ్ లో లారెన్స్ డైరెక్షన్లోనే  లక్ష్మీ బాంబ్ గా తెరకెక్కుతోంది.

 

ఇంకా బాలీవుడ్ లో ఈ హార్రర్ సినిమా కంప్లీట్ అవ్వనే లేదు ..మరో దెయ్యం సినిమాని చేస్తున్నానని అనౌన్స్ చేశాడు . అది ఈ సారి అంతకుమించి ఉండబోతోంది. ఎందుకంటే ఈ దెయ్యం ఈసారి రజనీకాంత్ ది. అదే తెలుగు, తమిళ్ లోసూపర్ హిట్ అయిన చంద్రముఖి సినిమాకి చంద్రముఖి 2 గా సీక్వెల్ నని  చెప్పాడులారెన్స్.

 

అయితే ఇప్పటిరవరకూ తనహార్రర్ సినిమాలకు ఎక్కువగా తనే డైరెక్ట్ చేసిన లారెన్స్ ఇప్పుడు చంద్రముఖి 2 కి మాత్రం చంద్రముఖి సినిమాని డైరెక్ట్ చేసిన పి.వాసునే డైరెక్టర్ గా  అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది.  సో ఇప్పట్టో లారెన్స్ ని దెయ్యం వదిలేలా  కనిపించడం లేదు.  చంద్రముఖి  సినిమా సూపర్హిట్ అవ్వడంతో ఈ సినిమా కూడా మరో హిట్ ఇస్తుందనుకుంటున్నారు ఆడియన్స్

మరింత సమాచారం తెలుసుకోండి: