ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్న కరోనా ప్రభావాన్ని ఎంత కట్టడి చేసిన కూడా వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు.. జనతా కర్ఫ్యూ లో భాగంగా లాక్ డౌన్ కొనసాగుతుంది..ఈ మేరకు ప్రజలను ఇళ్ళ నుంచి బయటకు రానివ్వకుండా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుంది.. అయినా కొంత మంది పోలీసులు మమ్మల్ని ఏం చేస్తారు అనే దైర్యం తో ముందుకు వస్తున్నారు.. ఇకపోతే లాక్ డౌన్ కారణంగా అనేక సంస్థలు మూతపడ్డాయి.. 

 

 

 

ఇప్పటికే చాలా మంది సెలెబ్రెటీలు విరాళాలు అందించారు.. అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా వాయిదా పడ్డాయి.. ఇకపోతే కరోనా ప్రభావం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పెద్ద హీరోల సినిమాల విడుదలకు చుక్కెదురై పరిస్థితి కొనసాగుతుందని సినిమా వర్గాల్లో బలంగా వినపడుతుంది.. ముఖ్యంగా పర్యాటక రంగం సినీ రంగం మీద దీని ఎఫెక్ట్ ఎక్కువగా పడింది.

 

 

 

 

 సినీ ఇండస్ట్రీ షూటింగులు అన్నీ ఆపుకొని థియేటర్స్ మల్టీప్లెక్స్ మూతవేసి లాక్ డౌన్ చేసుకుంది. దీంతో ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమాలు తమ విడుదల తేదీలను వాయిదా వేసుకున్నాను. షూటింగులు ఆగిపోవడంతో ఈ ఏడాది విడుదలయ్యే సినిమాలు కూడా తగ్గే అవకాశం ఉంది. మన టాలీవుడ్ లో ఈ ఏడాది అల్లు అర్జున్ బాలయ్య నిఖిల్ నాగచైతన్య లాంటి హీరోలు రెండు రెండు సినిమాలను రెడీ చేయాలని అనుకున్నారు..కానీ దెబ్బకు ఏడాదిలో ఒక్క సినిమా విడుదల కావడం కూడా కష్టమవుతుందని అర్థమవుతుంది.. 

 

 

 

మద్యం నుంచి ధ్యాస మార్చుకోవాలాంటి ఇలా చేయాలని ప్రముఖ నటుడు జగపతి బాబు సూచనలు తెలుపుతూ వీడియో ను పోస్ట్ చేశారు..ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.. అందులో జగపతి బాబు మాట్లాడుతూ ..మద్యాన్ని పూర్తిగా మానడం కష్టమే కానీ , మెల్ల మెల్లగా దానిమీద నుంచి ధ్యాస మార్చుకోవాలంటే యోగా చేయాలని సూచించారు.. పారిశుధ్య కార్మికులు, పోలీసులు, డాక్టర్ల బాధలతో పోలిస్తే మన బాధ చిన్నదే అని అన్నారు..లాక్ డౌన్ ముగిసేవరకు ఇళ్ళల్లో ఉంటూ ప్రభుత్వ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: