మే 20 నందమూరి ఫ్యాన్స్ కు పండుగ రోజు. ఆరోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే. ప్రతి సంవత్సరం లానే ఈ ఇయర్ కూడా ఎన్టీఆర్ బర్త్ డే కు ఫ్యాన్స్ కు సర్ ప్రయిజ్ లు ప్లాన్ చేస్తున్నాడు తారక్. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ ఆ సినిమాలో మరోసారి తన నట విశ్వారూపం చూపిస్తాడని అంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మరోసారి త్రివిక్రమ్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ కు సంబందించిన టాకీ పార్టీ పూర్తికాగానే ఎన్టీఆర్. రామ్ చరణ్ ఇద్దరు ఆర్.ఆర్.ఆర్ నెక్స్ట్ ప్రాజెక్టులు చేస్తారట. 

 

ఆర్.ఆర్.ఆర్ నుండి అల్లూరి లుక్ లీక్ అయ్యింది. మన్యం వీరుడిగా అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ అదరగొట్టేలా ఉన్నాడు. రిలీజైన అల్లూరి టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇక రావాల్సింది ఎన్టీఆర్ లుక్.. చరణ్ అల్లూరి గెటప్పే ఈ రేంజ్ లో ఉంటే ఎన్టీఆర్ రోల్ ను జక్కన్న ఎలా ప్లాన్ చేశాడా అని నందమూరి ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు. ఇక మే 20న తారక్ పుట్టినరోజు కానుకగా ట్రిపుల్ ఆర్ నుండి కొమరం భీమ్ టీజర్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేస్తాడని తెలుస్తుంది. 

 

ఇక ఈ సినిమాతో పాటుగా త్రివిక్రమ్ డైరక్షన్ లో చేస్తున్న నెక్స్ట్ సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ కూడా తారక్ బర్త్ డే నాడు రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు అయినాను పోయి రావలె టైటిల్ ప్రచారంలో ఉంది. మరి ఆ టైటిల్ నే ఫిక్స్ చేస్తారా లేక వేరేది ఏదైనా ఫైనల్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: