రాజకీయాల విషయంలో చిరంజీవి.. పవన్ కళ్యాణ్ మధ్య సిద్ధాంతాలు వేరుగా ఉన్నా.. సినిమాల విషయంలో మాత్రం ఇద్దరి ఆలోచన ఒక్కటే. పొలిటికల్ గా చిరంజీవి తమ్ముడితో పోటీపడలేకపోతున్నాడు. పవన్ పార్టీ వ్యవహారాలతో బిజీగా ఉంటే.. అన్నయ్య మాత్రం పాలిటిక్స్ కు దూరంగా ఉన్నాడు. అయితే సినిమాల్లో నటించే విషయంలో మాత్రం.. తమ్ముడితో అన్నయ్య పోటీ పడుతూ దూకుడు పెంచాడు. 

 

కరోనా హాలిడేస్ లో చిరంజీవి చాలా బిజీ. ఒకవైపు ఆటో బయోగ్రఫీ వినిపిస్తుంటే.. రికార్డ్ చేస్తున్నారు. మరోవైపు ట్విట్టర్ లో యాక్టీవ్ గా ఉంటూ.. కరోనాను అరికట్టే క్రమంలో తనవంతు సలహాలు.. సూచనలు చేస్తున్నారు. అలాగని సినిమాలను పట్టించుకోవడం మానేయలేదు. తర్వాతి ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడుతూ.. డైరెక్టర్స్ కథలు.. దర్శకులను ఎంచుకునే పనిలో నిమగ్నమయ్యాడు చిరంజీవి. 

 

చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత మళయాళ హిట్ లూసీఫర్ రీమేక్ లో నటిస్తాడు. తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది. ఆ మధ్య సుకుమార్ ఛేంజెస్ చేశాడు. తాజాగా తెరపైకి సాహో ఫేం సుజిత్ పేరు వినిపిస్తోంది. తనకు నచ్చినట్టు స్క్రిప్ట్ రెడీ చేస్తే.. లూసీఫర్ దర్శకుడిగా సుజిత్ ఫిక్స్ చేసే ఆలోచనలో చిరంజీవి ఉన్నాడు. యూవీ క్రియేషన్స్.. కొణిదెల ప్రొడక్షన్స్ ఈ మూవీని నిర్మించనుంది. 

 

మెగాస్టార్ లిస్ట్ లో ఉన్న మరో డైరెక్టర్ బాబి. వెంకీమామ తర్వాత కనిపించని ఈ దర్శకుడు మెగాస్టార్ మూవీ దర్శకుడిగా వెలుగులోకి వచ్చాడు. రవితేజతో తీసిన పవర్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన బాబి రెండో సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ తో నిరాశపరిచాడు. ఆ తర్వాత జై లవకుశ తో సక్సెస్ అందుకున్నాడు. నాలుగో సినిమా వెంకీమామకు ఏవరేజ్ మార్కులే పడ్డాయి. ఐదో సినిమాలో చిరంజీవిని డైరెక్టర్ చేస్తాడన్న టాక్ నడుస్తోంది. 

 

బాబి చెప్పిన కథ నచ్చడంతో.. డెవలెప్ చేయాల్సిందిగా చిరంజీవి కోరాడట. ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో మూవీ అనుకునే చిరంజీవి మనసు మార్చుకున్నాడు. సరైన కథ దొరక్క.. డైరెక్టర్ సెట్ కాక చాలా ఇబ్బందులు ఫేస్ చేశాడు చిరంజీవి. దీంతో ఒక సినిమా సెట్స్ పై ఉండగానే.. తర్వాతి మూవీని లైన్ లో పెట్టేస్తున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: