టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ బాల నటుడిగా నటించి ప్రేక్షకులను మెప్పించిన చిత్రం బాల రామాయణం. ఈ సినిమా విడుదలై నేటికి 24 ఏళ్లు పూర్తయింది. దర్శకుడు గుణశేఖర్ చిన్నారులతో చూడచక్కగా ఇతిహాసమైన రామాయణాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలై 24 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా సినిమాకు సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 
 
1996లో బాల రామాయణం చిత్రం విడుదలైంది. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆ ఏడాది ఈ చిత్రానికి ఉత్తమ చిన్నారుల చిత్రంగా అవార్డు సైతం దక్కింది. రాముడిగా ఎన్టీయార్ అద్భుతంగా ఉన్నాడంటూ వైరల్ అవుతున్న ఫోటోలను చూసి ఎన్టీయార్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ పౌరాణిక చిత్రంలో ఎన్టీయార్ రాముడి పాత్రలో కనిపించగా స్మితా మాధవ్ సీత పాత్రలో నటించారు. 
 
సినిమా సమయంలో జూనియర్ తెగ అల్లరి చేశాడని సమాచారం. జూనియర్ అల్లరిని భరించలేక దర్శకుడు గుణశేఖర్ జూనియర్ మీద సీరియస్ అయ్యాడని... జూనియర్ సెట్స్ నుండి వెళ్లిపోతానని చెప్పాడని గతంలో ఒక వార్త వైరల్ అయింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీయార్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. 2021 సంవత్సరం జనవరి 8న ఈ సినిమా విడుదల కానుంది. 
 
రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో ఎన్టీయార్ కొమరం భీం పాత్రలో ఈ సినిమాలో నటిస్తున్నారు. చరిత్ర ప్రకారం వీరిద్దరూ ఒకరినొకరు కలవకపోయినా రాజమౌళి వీరిద్దరూ కలిసి పోరాటం చేస్తే ఏ విధంగా ఉంటుందనే కల్పితమైన కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దాదాపు 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అలియాభట్, ఒలీవియా మోరిస్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: