కోలీవుడ్,టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు ఇళయదళపతి విజయ్. సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ స్థాయి పాపులారిటీ సంపాదించిన నటుడు విజయ్.  గత కొంత కాలంగా విజయ్ నటించిన సినిమాలు ఎన్నో కాంట్రవర్సీకి గురి అవుతూ వస్తున్నాయి. కానీ థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత మాత్రం బీభత్సం సృష్టిస్తున్నాయి. కలెక్షన్లలో రికార్డుల మోత మోగిస్తున్నాయి.   ఇటీవల విజిల్ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్.  వరుస విజయాలతో సంచలనం రేపుతున్న తమిళ సూపర్‌స్టార్ విజయ్ ఆశలపై కరోనా నీళ్లు జల్లింది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వస్తున్న మాస్టర్ సినిమాకు కరోనా లాక్‌డౌన్ అడ్డంకిగా మారింది.

 

వాస్తవానికి మాస్టర్ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. కానీ లాక్‌డౌన్ కారణంగా సినిమా హాళ్లు మూతపడటంతో రిలీజ్ కూడా వాయిదా పడింది.  లాక్‌డౌన్ పిరియడ్‌ను మాస్టర్ సినిమా ప్రమోషన్స్‌కు ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. మాస్టర్ ట్రైలర్‌ను ఫ్యాన్స్‌కు అందించాలని ప్లాన్ చేశారు. అయితే లాక్‌డౌన్ ఎత్తివేయగానే సినిమా ట్రైలర్ విడుదల చేసి రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు విజయ్ అభిమానులంతా ఆయన తాజా మూవీ 'మాస్టర్' కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. జూన్ 22వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారనేది తాజా సమాచారం.

 

ఆ రోజున విజయ్ పుట్టినరోజు కావడంతో, దర్శక నిర్మాతలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా చెబుతున్నారు.  కరోనా ప్రభావం తగ్గిన తరువాత ట్రైలర్ వదలడమే కరెక్ట్ అనే ఆలోచన చేస్తున్నట్టుగా చెబుతున్నారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, మాళవిక మోహనన్ హీరోయిన్ నటిస్తుండగా, ప్రతినాయకుడి పాత్రలో విజయ్ సేతుపతి కనిపించనున్నాడు.  అయితే ఈ మూవీ రిలీజ్ కి ముందు ఎలాంటి ట్విస్ట్ లు ఇస్తుందో.. ఎన్ని కాంట్రవర్సీలకు గురి చేస్తుందో అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: