ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా రంగంలో ఎంట్రీ ఇవ్వ‌డ‌మే ఓ సంచ‌ల‌నం. ఈ విష‌య ప్ర‌త్యేకంగా చెప్పక్క‌ర్లేదు. అక్క‌డ అమ్మాయి.. ఇక్క‌డ అబ్బాయి సినిమాతో వెండి తెరంగ్రేటం చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్ స్టార్టింగ్‌లో వ‌రుస హిట్ల‌తో చిరంజీవి త‌మ్ముడు అన్న ఇమేజ్ నుంచి నేడు తిరుగులేని ఇమేజ్‌తో త‌న‌దైన స్టైల్లో స్టార్ హీరో అయ్యాడు. అక్క‌డ అమ్మాయి - ఇక్క‌డ అబ్బాయి, గోకులంలో సీత‌, సుస్వాగ‌తం, త‌మ్ముడు, బ‌ద్రి, ఖుషీ ఇలా కెరీర్ స్టార్టింగ్ లో అన్ని తిరుగులేని హిట్లే ప‌వ‌న్ సొంతం. 

 

ఖుషీ త‌ర్వాత రెండేళ్లు ల్యాంగ్ గ్యాప్ తీసుకున్న ప‌వ‌న్ 2003లో సొంత డైరెక్ష‌న్‌లో జానీ సినిమా చేశాడు. ఈ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. జానీ త‌ర్వాత మ‌ళ్లీ యేడాదిన్న‌ర గ్యాప్ తో గుడుంబా శంక‌ర్ సినిమా మ‌ళ్లీ డిజాస్ట‌ర్‌. ఆ త‌ర్వాత బాలు కూడా స‌రిగా ఆడ‌లేదు. అన్నవ‌రం ప్లాప్‌. ఇలా వ‌రుస ప్లాపుల త‌ర్వాత ఎట్ట‌కేల‌కు 2008లో వ‌చ్చిన జ‌ల్సా ఓ మోస్తరుగా ఆడింది. మ‌ళ్లీ కొమరం పులి డిజాస్ట‌ర్. తీన్‌మార్ సైతం స‌రిగా ఆడ‌లేదు. పంజా డిజాస్ట‌ర్‌. ఇలా ఎన్నో ఇబ్బందుల త‌ర్వాత గ‌బ్బ‌ర్‌సింగ్ వ‌చ్చింది. ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. 

 

ఆ వెంట‌నే వ‌చ్చిన అత్తారింటికి దారేది కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్. ఇలా ప‌వ‌న్ క‌ళ్యాన్ 12 ఏళ్ల పాటు త‌న స్థాయికి తగిన హిట్ల కోసం వెయిట్ చేశాడు. తాను ప‌వ‌ర్ స్టార్‌ను అని ఫ్రూవ్ చేసుకున్నాడు. ఈ రెండు సినిమాల త‌ర్వాత వ‌చ్చిన క్రేజ్‌తోనే ప‌వ‌న్ రాజ‌కీయారంగ్రేటానికి బీజం ప‌డింది.

మరింత సమాచారం తెలుసుకోండి: