తెలుగు సినిమాల మీద తమిళ హీరోలు ఎక్కువగా ఫోకస్ చేస్తూ వస్తున్నారు. చిన్న చిన్న హీరోలు కూడా మన తెలుగులో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మన తెలుగు సినిమాలను తమిళంలో చూడకపోయినా తెలుగులో మాత్రం తమిళం సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. అక్కడి హీరోలకు ఇక్కడ అభిమానులు కూడా ఉన్నారు. దాదాపు అగ్ర హీరోల సినిమాలు అన్నీ కూడా ఇక్కడ బాగానే ఆడే పరిస్థితి ఉంటుంది. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు కీలక హీరోలు అందరూ కూడా ఇక్కడ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 

 

ప్రస్తుతం విజయ్ సేతుపతికి తమిళంలో డిమాండ్ బాగానే ఉంది. అతను తెలుగులో సినిమాలు కూడా చేస్తున్నాడు. యువ హీరోల సినిమాల్లో అతను విలన్ గా నటిస్తున్నాడు. అల్లు అర్జున్ సినిమా పుష్ప లో అతను విలన్ గా నటించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది అంటున్నారు. అతను ఇక్కడ సినిమాలా మీద దృష్టి తగ్గించాడు. దానికి కారణం... తమిళ సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడమే. అక్కడ సినిమాలలో అతను బిజీ గా ఉండటం ఇక బాలీవుడ్ లో కూడా అవకాశాలు రావడం తో విజయ్ ఇప్పుడు... 

 

తెలుగు సినిమాలను పక్కన పెట్టాడు. అతనికి ఇక్కడ అభిమానులు కూడా భారీగానే ఉన్నారు. మరి ఏమైందో ఏమో ఇక్కడ ఒప్పుకున్నా సినిమాలు కూడా వద్దని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. తెలుగు సినిమాల మీద అతనికి ఆసక్తి ఉన్నా సరే ఖాళీ గా లేక వీటిని పక్కన పెట్టినట్టు సమాచారం. అల్లు అర్జున్, మహేష్ బాబు సినిమాల్లో అతను విలన్ గా నటించాల్సి ఉంది. అవి పెద్ద సినిమాలే అయినా సరే అతను ఎందుకు వెనక్కు తగ్గుతున్నాడు అసలు కారణం అదేనా లేక ఇంకేదైనా ఉందా అనేది అర్ధం కావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: