బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ అన్నవిషయం తెలురాష్ట్రాలలో అందరికి తెలిసిన విషయమే. అయితే తన అభిమానాన్ని మరోసారి ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. పవన్ కళ్యాణ్ తో బండ్లగణేష్ తీన్మార్ సినిమా చీసి ఇప్పటికి 9 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో తాను ఈ సినిమా కి సంబందించిన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
అయితే పవన్ కళ్యాన్‌తో తీన్మార్ మరియు గబ్బర్ సింగ్ సినిమాలు చేసినవిషయం తెలిసిందే. అయితే దీనిపైన బండ్ల గణేష్ స్పందిస్తూ.. పవన్‌ని ఆకాశానికెత్తేసాడు.. తీన్ మార్ చిత్రం నా జీవితంలో ఓ ప్రత్యేకమైన చిత్రం. అయితే ఈ చిత్రం నిర్మాణం నాజీవితలో మరచిపోలేని జ్ఞాపకం. అర్జున్ పాల్వాయ్ గా మైకేల్ వేలాయుధమూగా మా బాస్ ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు అంటూ ట్వీట్ చేశాడు.
ఈ చిత్రం నిర్మించే అవకాశం నాకు ఇచ్చిన నాకు దైవ సమానులైన మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇంకొక్కసారి హృదయపూర్వక పాదాభివందనం@PawanKalyan #Trivikram #9YearsForTeenMaar pic.twitter.com/eY1sf2HHRS
— BANDLA GANESH (@ganeshbandla) April 14, 2020