భూమిక... ఇప్పుడు తెలుగులో ఎక్కువగా కీలక పాత్రలకు ఎంపిక అవుతున్న హీరోయిన్. ఆమెతో సినిమా చేయడానికి అగ్ర దర్శకులు హీరోలు కూడా ఎదురు చూస్తూ వస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో ఆమె చేస్తున్న సినిమాలు అన్నీ కూడా అగ్ర దర్శకులతో చేసేవి. టాలీవుడ్ లో ఆమెకు క్రమంగా అలాంటి పాత్రలకు డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు ఆమెకు విలన్ గా నటించే అవకాశాలు కూడా వస్తు ఉన్నాయి. విలన్ గా కీలక సినిమాల్లో చేయడానికి ఆమె ఒప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం భూమిక బాలకృష్ణ సినిమాలో కూడా ఆఫర్ దక్కించుకుంది. 

 

బాలయ్య రూలర్ సినిమాలో ఆమెకు మంచి పాత్ర వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఆమె తో ఒక బోల్డ్ సినిమా చెయ్యాలి అని ఒక దర్శకుడు భావించినట్టు సమాచారం. వెంటనే ఆమెను వెళ్లి అడగగా ఆమె అందుకు ఓకే  చెప్పింది అనేది టాలీవుడ్ జనాల మాట. ఆమె ఆ సినిమాలో పెట్టుబడి కూడా పెడుతున్నట్టు సమాచారం. టాలీవుడ్ లో ఆమెకు మంచి డిమాండ్ ఉందని గ్రహించిన నిర్మాతలు  ఆమెకు కొన్ని అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమాకు భారీగా పెట్టుబడి పెట్టి ఈ సినిమాను ఓకే చేసారు. 

 

ప్రస్తుతం టాలీవుడ్ లో కథ భిన్నంగా ఉండే సినిమాలకు క్రమంగా డిమాండ్ పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఇలాంటి సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా తెలుగులో బిజీ అవ్వాలని భూమిక మంచి పట్టుదలగా ఉంది. అగ్ర హీరోలు కూడా కథ భిన్నంగా ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ సినిమా భూమిక కు మంచి క్రేజ్ తీసుకోస్తుందా లేదా అనేది చూడాలి. ఆమె కు వరుస అవకాశాలు వస్తున్న తరుణంలో ఈ సినిమా ఎంత వరకు ఉపయోగపడుతుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: