తెలుగు సినిమాలను పాన్ ఇండియా వైడ్ గా తెరకేక్కించాలి అని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలకు తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉండటం తో... పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమాలను తీసుకుని వెళ్తున్నారు. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు తెలుగు సినిమాల కోసం ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్ లను తీసుకుని రావాలని భావిస్తున్నారు. అక్కడి అగ్ర హీరోయిన్స్ ని ఇక్కడ కి తీసుకొచ్చి సినిమాలు చెయ్యాలి అని చూస్తున్నారు. వాళ్ళు ఒప్పుకున్నా లేకపోయినా సరే భారీగా రేటు ఇచ్చి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 

 

అగ్ర హీరోయిన్ లు అందరూ కూడా తెలుగు మీద ఆసక్తిగా ఉన్నా సరే భారీగా డిమాండ్ చేయడం తో ఇప్పుడు దర్శక నిర్మాతలు భయపడే పరిస్థితి మన తెలుగులో వచ్చింది... వాళ్ళు కనీసం పది కోట్లు అడుగుతున్నారు. దీనితో ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇంత దారుణంగానా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో హీరోలకు మంచి డిమాండ్ ఉండటంతో భారీగా చెల్లించి సినిమాలు చేస్తున్నారు. ఇక హీరోయిన్ కి కూడా అంత మొత్తం ఇవ్వాలి అంటే చాలా కష్టం అనే భావనలో ఉన్నారు. 

 

అందుకే వాళ్ళను ఓకే చేసి కూడా ఆ తర్వాత పక్కన పెడుతున్నారు. ఇదే కొనసాగిస్తే మాత్రం కష్టమని నిర్మాతలు అనడం గమనార్హం. మన తెలుగు హీరోయిన్లు అక్కడ అవకాశాల కోసం ఎదురు చూస్తుంటే అక్కడి వాళ్లకు ఇక్కడి వాళ్ళు అవకాశం ఇచ్చినా సరే ఇంత మొత్తం అడగడం తో భయపడుతున్నారు. దీనితో సీనియర్ హీరోయిన్ అయినా ఏ రేంజ్ హీరోయిన్ అయినా సరే పక్కన పెట్టడమే మంచిది ఇక్కడి హీరోయిన్స్ నే తీసుకోవాలని చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చేస్తున్న అలియా భట్ కూడా భారీగానే డిమాండ్ చేసినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: