రకుల్ ఛాన్స్ లు కావాలని అడగకుండానే హింట్ ఇస్తోంది. పొగడకుండానే పోగొడుతోంది. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేయకుండానే ఛాన్స్ లకు ఎరవేస్తోంది. మొత్తానికి సౌత్ హీరోలకు సంబంధించి రకుల్ ప్రీత్ సింగ్ లాజిక్ పట్టేసింది. ఇంతకీ రకుల్ చెప్పిన లాజిక్ ఏంటో తెలుసా. ఈ బ్యూటీ ఛాన్స్ లు పట్టేయడానికి మేకర్స్ ని బుట్టలో వేసేందుకు చెప్పిన మాటలేంటో తెలుసా.. 

 

షార్ట్ టైమ్ లో రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కట్ చేస్తే ఎంత త్వరగా స్టార్ హీరోయిన్ అయిందో అంతే త్వరగా క్రేజ్ కోల్పోయింది. ఒకానొక సమయంలో రకుల్, మహేశ్ బాబు లాంటి బడా స్టార్స్ కు డేట్ లు లేవంటూ చెప్పిందంటే ఎంత బిజీగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తర్వాత స్పైడర్ సినిమాలో మహేశ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. మూడు ఏళ్ల పాటు టాలీవుడ్ ను ఏలింది. కట్ చేస్తే ప్రస్తుతం రకుల్ చేతిలో ఒక్క సినిమా లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ సౌత్ హీరోలపై చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. 

 

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. అటు కోలీవుడ్ లోనూ ఈ ముంబై పాపను పట్టించుకోవడం లేదు. బాలీవుడ్ లో మాత్రం అమ్మడికి అరకొర ఛాన్స్ లు వస్తున్నాయి. తాజాగా రకుల్ సౌత్ ఇండస్ట్రీకి సంబంధించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. కెరీర్ ఆరంభంలో చాలా ఆఫర్లు చేజారిపోయాయని.. తాను చేయాల్సిన సినిమాలు ఇతర హీరోయిన్స్ చేశారంటోంది. అయితే తన వరకు వచ్చి వెళ్లిన సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయని చెప్పింది.

 

సౌత్ లో హీరోయిన్స్ పారితోషికం విషయంలో రకుల్ ప్రీత్ సింగ్ డిఫరెంట్ గా మెచ్యూర్డ్ గా ఆన్సర్ ఇచ్చింది. సౌత్ లో హీరోల కోసమే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే విషయం తెలుసని రకుల్ చెబుతోంది. అందుకే సౌత్ హీరోలక భారీ పారితోషికాలు ఉంటాయని.. హీరోయిన్స్ కు కాస్త ఇస్తారంటోంది. ఈ లాజిక్ తెలుసు కాబట్టే రకుల్ ఎప్పుడు పారితోషికాల విషయాల్లో బెట్టు చేయలేదట. సౌత్ లో హీరోలకు సమానంగా హీరోయిన్స్ కు రెమ్యునరేషన్ ఇవ్వాలని తను డిమాండ్ చేయనని చెబుతోంది. మొత్తానికి ఛాన్స్ లను పట్టేయడానికి రకుల్ భలే ప్లాన్ వేసింది కదా. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: