పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ మహారాజా  రవితేజా ఇద్దరూ మంచి మిత్రులు. ఆ మాటకు వస్తే మెగా కాంపౌండ్ లోని అందరు హీరోలతో రవితేజాకు మంచి రిలేషన్లు ఉన్నాయి. చిరంజీవిని సొంత అన్నయ్యగా రవితేజా భావిస్తారు. అలాంటిది పవన్ తో ఎందుకు రవితేజాకు గొడవలు.

 

రవితేజా మూవీ నేల టికెట్ ఆడియో రిలీజ్ కి కూడా పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వచ్చాడు. రవితేజా గురించి నాలుగు మంచి మాటలు చెప్పాడు. ఇద్దరి మధ్యన ఉన్న సాన్నిహిత్యం గురించి కూడా ఎంతో బాబా పవన్ చెప్పాడు.

 

అటువంటిది పవన్ తో గొడవ ఎందుకు ఉంటుంది. అవును అసలు ఉండదు. అది నిజ జీవితం. కానీ తెర జీవితం అలా కాదు కదా. అందుకే గొడవలు. అవి కూడా నచ్చి మెచ్చి తెచ్చి పెట్టుకున్న గొడవలు.

 

అదేంటీ అంటే హరీష్ సంకర్ ఈ గొడవలకు కారకుడుగా. ఆయన రవితేజాతో మిరపకాయ మూవీ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.అలాగే పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమా తీసి బంపర్  హిట్ కొట్టాడు. 

 

ఇపుడు పవన్ రీ ఎంట్రీ ఇచ్చి వరసగా సినిమాలు చేస్తున్నాడు. ఇక హరీష్ శంకర్ తో కూడా పవన్సినిమా చేస్టాడని టాక్ నడుస్తోంది. ఆ సినిమాకు అసలైన విలన్ రవితేజా అని హరీష్ శంకర్ నిర్ణయించాడట.

 

ఈ మూవీతో రవితేజా మళ్ళీ విలన్ వేషాలకు రెడీ అవుతాడన్న మాట. సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రవితేజా విలన్ గా కొన్ని మూవీస్ చేశాడు. తరువాత హీరో అయ్యాడు. మాస్ మహరాజాగా పేరు తెచ్చుకున్నాడు.

 

ఇక ఇపుడు ఆయన సినిమాలు సరిగ్గా ఆడడంలేదు. దాంతో ఆయన రూట్ మార్చాడా అన్న డౌట్లు వస్తున్నాయి. వేసి వేసి పవన్ లాంటి పవర్ ఫుల్ స్టార్ మూవీలో విలన్ గా వేస్తే ఆ క్రేజే వేరు. పైగా పవన్, రవితేజా కాంబో ఫ్రెష్ గా ఉంటుంది. హరీష్ శంకర్  ఐడియా అదుర్స్ అంటున్నారు. సో అఫీషియల్ న్యూస్ కి వెయిట్ అండ్ సీ.

 

మరింత సమాచారం తెలుసుకోండి: