స్టార్ హీరో జోడీ కడితే హీరోయిన్ల కెరీర్ మారిపోతుంది. టాప్ హీరోలతో స్టెప్పులేస్తే గ్రాఫ్ లో డ్రాస్టిక్ ఛేంజెస్ వస్తాయి. అలాంటిది పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ తో పనిచేస్తే ఈజీగా స్టార్ రేసులోకి వెళ్లొచ్చు. కానీ విచిత్రంగా వకీల్ సాబ్ కి మాత్రం హీరోయిన్ సెట్ అవడం లేదు. పవర్ స్టార్ తో జోడీ కట్టే హీరోయినే కనిపించడం లేదు. 

 

పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ పై టాలీవుడ్ లో భారీ బజ్ ఉంది. పింకే రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ కోసం పవన్ ఫ్యాన్స్ చాలా ఆతురుతగా ఎదురుచూస్తున్నారు. పవర్ స్టార్ ని స్క్రీన్ పై చూడ్డానికి ఆరాటపడుతున్నారు. దీంతో ఈ మూవీ భారీగా బిజినెస్ చేస్తుందనే అంచనాలున్నాయి. అయితే ఇంత బజ్ ఉన్న సినిమాకు ఇంకా హీరోయిన్ మాత్రం సెట్ కావడం లేదు. 

 

అత్యాచారయత్నం నుంచి తప్పించుకున్న అమ్మాయిలు, వాళ్ల తరఫున న్యాయ పోరాటం చేసే లాయర్ కథాంశంతో తెరకెక్కింది పింక్. హిందీలో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను, తెలుగునాట పవన్ కళ్యాణ్ ప్లే చేస్తున్నాడు. ఇక న్యాయపోరాట నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రెగ్యులర్ హీరోయిజం కనిపించదు. ఇక హీరోయిన్  రోల్ కు పెద్దగా స్కోప్ ఉండదు. 

 

తమిళ్ లో అజిత్ హీరోగా పింక్ రీమేక్ తెరకెక్కింది. ఈ తమిళ వెర్షన్ లో హీరోకు ఓ ఫ్లాష్ బ్యాక్ పెట్టి, హీరోయిన్ కు చోటిచ్చారు. అలాగే తెలుగులోనూ ఈ ట్రాక్ ని కంటిన్యూ చేస్తున్నారు. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసమే శృతి హాసన్ ని తీసుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ జోడీ కుదరలేదు. మామూలుగానే సినిమాల్లో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండట్లేదు. ఇక ఒక్క ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనే సరికి చాలా మంది హీరోయిన్లు వెనుకాడుతున్నారు. గెస్ట్ అప్పీరియన్స్ లాంటి పాత్రతో కెరీర్ కు ప్రయోజనం ఉంటుందా అని ఆలోచిస్తున్నారు. అందుకే వకీల్ సాబ్ కి జోడీ దొరకడం కష్టంగా ఉంది అంటున్నారు సినీజనాలు.  

మరింత సమాచారం తెలుసుకోండి: