టాలీవుడ్ యువ నటుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. మంచి ఫ్యామిలీ, కమర్షియల్ ఎంటర్టైనర్ గా త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగ్స్ తో పాటు తన మార్క్ స్టైలిష్ యాక్షన్ తో అదరగొట్టిన అల్లు అర్జున్, దాని అనంతరం ప్రస్తుతం తనకు ఎంతో ఇష్టమైన సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. మంచి మాస్, యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడిగా రష్మిక మందన్న నటిస్తుండగా, దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. 

 

ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు బన్నీ ఫ్యాన్స్ తో పాట్లు సాధారణ ప్రేక్షకుల నుండి కూడా మంచి స్పందన లభించింది. కాగా అల్లు అర్జున్ లో మరొక కోణం ఉందని, అందరికీ బన్నీ కేవలం హీరోగానే తెలుసునని, అయితే అతడిలో ఒక మంచి ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నాడని, బన్నీ యొక్క ఆ హాబీ గురించి తన ఫ్రెండ్స్ కి కుటుంబసభ్యులకు మాత్రమే తెలిసునని సమాచారం. అయితే ఈ విషయాన్ని ఇటీవల అల్లు అర్జున్ సన్నిహితులు కొందరు వెల్లడించినట్లు తెలుస్తోంది. 

 

అల్లు అర్జున్ వద్ద పలు రకాల మంచి లొకేషన్స్ లో షూట్ చేసిన ఫోటోలు ఉన్నాయని, ఎక్కడికి వెళ్లినా తన వెంట ఒక కెమెరా ని తీసుకువెళ్లి ఆయా ప్రదేశాల్లోని అందాలను ఫోటోలు తీసి బంధించే అలవాటు బన్నీ కి ఉందని, ఎంత హీరో అయినప్పటికీ ఎవరికి వారికి ప్రత్యేకంగా కొన్ని అలవాట్లు ఉంటాయి కదా అని వారు చెప్తున్నారు. ఇక ఎక్కువగా ఏ విషయాన్ని అయినా ఎంతో కష్టపడి నేర్చుకునే అలవాటున్న బన్నీ, ఈ రోజున తన సినిమా కెరీర్ లో ఇంత పెద్ద స్థాయికి రావడానికి అదే కారణం అని వారు అంటున్నారు. అలానే అందరితోనూ ఎంతో సరదాగా వ్యవహరించే బన్నీకి సరదాగా ఫ్యామిలీ తో పాటు ఫ్రెండ్స్ తో కూడా గడిపే అలవాటు ఉందని వారు చెప్పినట్లు తెలుస్తోంది....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: