పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పింక్ తెలుగు రీమేక్ వకీల్ సాబ్ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో నివేదా థామస్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తుండగా సినిమాలో పవన్ కు జోడీగా శృతి హాసన్ ను ఫైనల్ చేసినట్టు చెప్పుకొచ్చారు. కానీ శృతి హాసన్ వకీల్ సాబ్ లో తానూ చేయట్లేదని చెప్పేసింది. దిల్ రాజు ఆఫర్ ను కాదన్న శృతి హాసన్ ఇప్పుడు వకీల్ సాబ్ యూనిట్ ను ఇరకాటంలో పడేసింది,

 

పవర్ స్టార్ తో గబ్బర్ సింగ్ లో కలిసి నటించిన శ్రుతి హాసన్ మళ్ళీ ఆ కాంబో రిపీట్ అయితే చూడాలని అనుకున్నారు ఫ్యాన్స్. కొన్నాళ్లుగా ప్రేమా గీమా అంటూ తిరిగి సినిమాలు చేయని శృతి హాసన్ ఈమధ్యనే తెలుగులో మాస్ మహారాజ్ రవితేజతో క్రాక్ సినిమా చేస్తుంది. ఆ సినిమా తర్వాత పవన్ మూవీ ఛాన్స్ వచ్చినా చేయనని అంటుంది. ఇక శృతి హాసన్ చేయనంటే ఆ పాత్రలో గోవా  బ్యూటీ ఇలియానాని తీసుకునే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు. 

 

ఆల్రెడీ పవర్ స్టార్ తో జల్సా సినిమాలో జతకట్టిన ఇలియానా వకీల్ సాబ్ ఛాన్స్ అందుకుంది అంటున్నారు. ఫేడ్ అవుట్ అయినా ఇలియానా కొన్నాళ్లుగా సినిమాలు చెయ్యట్లేదు. తెలుగులో ఆమె చివరి సినిమా అమర్ అక్బర్ ఆంటోని. ఆ సినిమా కూడా ఫ్లాప్ అవడంతో ఇల్లి బేబీకి ఛాన్సులు ఇచ్చేవారు కరువయ్యారు. యితే వకీల్ సాబ్ సినిమాలో ఇలియానా నటించే ఛాన్సులు ఉన్నాయని తెలుస్తుంది. సినిమాలో ఇలియానా ఓకే అయితే సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ వచ్చినట్టే లెక్క. మరి ఈ వకీల్ సాబ్ తో అయినా ఇలియానా మళ్ళీ ఫామ్ లోకి వస్తుందేమో చూడాలి.    

మరింత సమాచారం తెలుసుకోండి: