టాలీవుడ్ లో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ సినిమా ఫ్లాపయినా సరే మొదటిరోజు కలక్షన్స్ రికార్డులు సాధిస్తాయి. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ ఫ్యామిలీ నుండి హీరోగా వచ్చిన పవన్ కళ్యాణ్ తన స్టైల్, యాటిట్యూడ్ తో యూత్ లో సూపర్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. పవన్ సూపర్ హిట్ కొట్టిన సినిమాల వసూళ్ల లెక్కలు గురించి అందరికి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ మిస్సైన కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. 

 

ఒకవేళ ఆ సినిమాలు కూడా చేసుంటే పవర్ స్టార్ రేంజ్ వేరేలా ఉండేదని చెప్పొచ్చు. త్రివిక్రమ్ డైరక్షన్ లో మహేష్ చేసిన అతడు సినిమా కథ ముందు త్రివిక్రమ్ పవన్ కె వినిపించాడు. కానీ ఆ కథ వింటూ పవన్ పడుకున్నాడని అప్పుడెప్పుడో ఇంటర్వ్యూలో చెప్పారు. పోకిరీకి ముందు మహేష్ కు మంచి ఫ్యాన్ బేస్ ఏర్పరచిన సినిమా అతడు. ఆ తర్వాత వచ్చిన పోకిరి మహేష్ కెరియర్ లో అప్పటి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 

 

ఇక పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో బద్రి సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమానే కాదు ఆ తర్వాత పూరి ప్రతి సినిమా కథ పవన్ కు వినిపించడం ఆయన కాదనడం జరిగిందట. రవితేజతో పూరి చేసిన ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి కథలు పవన్ కోసం రాసినవే.. కానీ ఆయన చేయనని చెప్పడంతో రవితేజ చేశాడు. ఆ సినిమాలతోనే రవితేజ హీరోగా స్థిరపడ్డాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ పోకిరి సినిమాను కూడా పవన్ కోసం రాశాడట. పవన్ కాదనడం మహేష్ చేయడం ఆ సినిమా సంచలన విజయం సాధించడం జరిగిందట.

 

పోకిరి ఎడిట్ సూట్ లో సినిమా అంతా ఏదోలా ఉంది పక్కా ఫ్లాప్ అనుకున్నారట. కానీ పూరి మాత్రం నమ్మకంగా ఉన్నాడట. పూరి నమ్మకమే నిజం చేస్తూ సినిమా సంచలన విజయం అందుకుంది. జస్ట్ ఇమాజిన్ ఒకవేళ పోకిరి మూవీ పవన్ కళ్యాణ్ చేసుంటే ఎలా ఉండేది.. అబ్బో అంచనాలకు అందట్లేదు కదా.. ఇలా కెరియర్ లో సూపర్ హిట్ సినిమాలను మిస్సైన పవన్ తను చేసిన సినిమాలతో రికార్డులు కొడుతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: