టాలీవుడ్ లో జూనియర్ కి ఉన్న క్రేజ్ అందరికి తెలిసిందే. అతని సినిమా విడుదల అవుతుంది అంటే చాలు అతని అభిమానులతో పాటుగా అన్ని వర్గాల ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురు చూస్తారు అనేది ఒక స్పష్టత ఉంది జనాలకు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. రాజమౌళీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ లో దాదాపు ఎన్టీఆర్ పాల్గొనేది అయిపోయింది. అతని షూటింగ్ కేవలం ఒక పది రోజులు మాత్రమే ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఎక్కువగా త్రివిక్రమ్ సినిమా మీద దృష్టి పెట్టాడు. 

 

త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న ఎన్టీఆర్ పలు సలహాలను కూడా ఇస్తున్నట్టు సమాచారం. ఇప్పుడు ఈ సినిమాను తమిళంలో ఎక్కువగా ఆడించాలి అని భావిస్తున్నాడు. తమిళ మార్కెట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడి సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. అందుకే ఎన్టీఆర్ ఇప్పుడు తమిళ సినిమా మీద ఎక్కువగా ఫోకస్ చేసాడు. తెలుగులో సినిమాలు ఎలాగూ ఆడే అవకాశం ఉందని కాబట్టి తమిళం మీద ఫోకస్ చేస్తే కలిసి వస్తుంది అని భావించాడని టాలీవుడ్ లో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. 

 

ఎన్టీఆర్ కి అక్కడ క్రేజ్ తక్కువగానే ఉంది. అక్కడ ఎన్టీఆర్ సినిమాలకు పెద్దగా స్పందన లేదు. అయితే ఆర్ఆర్ఆర్ డబ్బింగ్ ని తానే చెప్తున్నాడు. తన వాయిస్ ద్వారా తమిళ ప్రేక్షకులకు దగ్గర కావాలి అనేది ఎన్టీఆర్ ప్లాన్. రాజమౌళి కూడా ఇదే విషయాన్ని ఎన్టీఆర్ కి సూచన కూడా చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ని తమిళంలో విడుదల చేస్తారు. అక్కడ ఎలాగూ ఈ సినిమాకు రాజమౌళి పేరుతో ఆదరణ ఉంటుంది కాబట్టి... ఇక ఈ సినిమా తర్వాత వచ్చే సినిమాలను కూడా తమిళంలో ఆడించాలి అని ఎన్టీఆర్ పట్టుదలగా ఉన్నాడని టాలీవుడ్ లో సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: