టాలీవుడ్ లో పుష్ప సినిమాకు ఇప్పుడు అసలు ఏ షూటింగ్ లేకుండా ఫస్ట్ లుక్ తోనే మంచి క్రేజ్ వచ్చింది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఈ సినిమా గురించి ప్రేక్షకులు అప్పుడే ఎదురు చూస్తున్నారు అనేది కూడా అర్ధమవుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ లో అల్లు అర్జున్ కనపడిన విధానం ఎందరినో ఆకట్టుకుంది. ఈ సినిమా గురించి చర్చలు కూడా ఆ లుక్ నుంచే మొదలయ్యాయి. టైటిల్ కూడా కాస్త భిన్నంగా ఉండటం తో టాలీవుడ్ జనాలు ఆ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

 

సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే సూచనలు కనపడుతున్నాయి. సినిమా మీద అల్లు అర్జున్ కూడా ఎక్కువగానే దృష్టి పెట్టాడు కాబట్టి సినిమా ఏ విధంగా ఉంటుంది అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ సినిమా కోసం వేరే సినిమాలను కూడా బన్నీ పక్కన పెట్టినట్టు సమాచారం. ఈ సినిమాలో అతని పాత్ర ఏ విధంగా చూపిస్తాడు సుకుమార్ అనేది కూడా ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్. రంగస్థలం సినిమా తర్వాత అల్లు అర్జున్ తో చేస్తున్నాడు సుకుమార్. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. దీనితో ఈ సినిమా మీద కూడా ఎక్కువగా దృష్టి పెట్టారు ప్రేక్షకులు. 

 

సినిమా వచ్చే ఏడాది ఎప్పుడు విడుదల అవుతుంది అనేది పక్కన పెడితే ఇప్పుడు విలన్ గా ఎవరిని ఎంపిక చేసే అవకాశం ఉంది అనేది స్పష్టత రావడం లేదు. విలన్ గా ఇప్పుడు విజయ్ సేతుపతిని ఎంపిక చేస్తారు అని భావించినా అది సాధ్యం కాలేదు. ఇప్పుడు సునీల్ శెట్టి అని అంటున్నారు. అతను నటిస్తాడు లేదు అనేది కూడా స్పష్టత రావడం లేదు. మరి ఎవరిని ఎంపిక చేస్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: