పవన్ ఎన్నో ఆలోచనలు చేసి చివరకు సినిమాలలో తిరిగి నటించే విధంగా తీసుకున్న యూటర్న్ నిర్ణయం పవన్ కు ఏమాత్రం కలిసివచ్చినట్లు అనిపించడంలేదు. కరోనా సమస్యలు వల్ల షూటింగ్స్ కు బ్రేక్ పడటంతో ప్రస్తుతం అతడు నటిస్తున్న ‘వకీల్ సాబ్’ అదేవిధంగా క్రిష్ దర్శకత్వంలోని చారిత్రాత్మక నేపధ్యం ఉన్న ఫ్యాంటసీ మూవీలు ఆగిపోయాయి. పవన్ ఇప్పటివరకు తన కెరియర్ లో ఎన్నడు లేనివిధంగా ఒకేసారి రెండు సినిమాలలో నటిస్తూ అందరికీ షాక్ ఇస్తే ఈషాక్ ను తట్టుకోలేక కరోనా కూడ పవన్ షూటింగ్ లకు అడ్డుపడుతోంది.


దీనితో పవన్ నటిస్తున్న సినిమాలు మళ్ళీ ఎప్పుడు ప్రారంభం అవుతాయో అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో పవన్ కు కూడ తెలియని అయోమయ పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ గురించి ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఈమూవీ కథ అంతా మొగలాయిల కాలంనాటి పరిస్థితుల నేపధ్యంలో ఉంటూ ప్రపంచ విఖ్యాత కోహినూర్ వజ్రం చుట్టూ తిరుగుతుందని లీకులు వస్తున్నాయి. దీనితో క్రిష్ మొగలాయిల కాలంనాటి పరిస్థితులను ప్రతిబింబించే విధంగా తన సినిమాలో సీన్స్ ఉండాలని భావించి ఈమూవీకి సంబంధించిన ఒక కీలక షెడ్యూల్ ను మొరాకో జార్జియా దేశాలలో తీయాలని భావించాడు.


గతంలో క్రిష్ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ‘కంచె’ సినిమాలను చిత్రీకరించిన మొరాకో ప్రాంతంలోని భారీ పురాతన భవనాలు మొగలాయిల కాలంనాటి భారీ కట్టడాలను తలపిస్తాయి అన్న ఉద్దేశ్యంతో పవన్ సినిమా షెడ్యూల్ ను కూడ అక్కడ తీయాలని భావించాడు. అయితే కరోనా సమస్యలు మొరాకో జార్జియా దేశాలను చుట్టివేయడంతో ఆదేశంలోకి విదేశీయులు ఎవరు రాకుండా 6నెలల ట్రావెల్ బ్యాన్ విధించారు. దీనితో ఈ షెడ్యూల్ ను ఎలా పూర్తి చేయాలి అని టెన్షన్ పడుతున్న క్రిష్ కు పవన్ ఒకసలహా ఇచ్చినట్లు టాక్.


రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ కోట సెట్టింగ్ వేసి భారీ గ్రాఫిక్స్ తో ఆ కోట కట్టడాన్ని అత్యంత భారీగా చూపెడుతూ జార్జియా మొరాకో దేశాల వాతావరణం తీసుకు రావచ్చు అని సలహా ఇచ్చాడట. అయితే పవన్ సలహామేరకు అలాంటి భారీ గ్రాఫిక్ వర్క్స్ ఈసినిమాకు చేయిస్తే ఈమూవీ బడ్జెట్ మరింత పెరిగిపోతుందని ప్రస్తుత పరిస్థితులలో ఈమూవీని మార్కెట్ చేయడం కష్టం అవుతుంది అని భావించి క్రిష్ ఈసినిమాకు సంబంధించి పవన్ కు ఇవ్వవలసిన 50 కోట్ల పారితోషికంలో కొంత కోత పెట్టుకుని గ్రాఫిక్ ఖర్చులకు సహకరించమని అడుగుతున్నాడట. దీనితో తాను క్రిష్ కు ఇచ్చిన సలహా తనకే రివర్స్ లో వచ్చి తన పారితోషికానికి ఎర్త్ పెట్టడంతో పవన్ తల పట్టుకుంటున్నట్లు టాక్..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: