దేశ  వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకి దాని తీవ్రత పెరగడమే గాని తగ్గిన సందర్భం అంటూ గత పది రోజుల్లో ఎక్కడా లేదు అనేది అర్ధమవుతుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అనేది అమలు చేస్తున్నారు. కరోనా కట్టడిలో లాక్ డౌన్ చాలా కీలకమవుతుంది అని భావించారు. వాస్తవానికి దాని ద్వారా మంచి ఫలితాలు ఉన్నా సరే ఇప్పుడు కరోనా మాత్రం కట్టడి కావడం లేదు అనే విషయం అర్ధమవుతుంది. ప్రతీ రోజు కరోనా కేసులు వందల్లో నమోదు అవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్ర తెలుగు రాష్ట్రాలు ఇలా కరోనా వైరస్ కి కేంద్రాలు గా మారాయి అనే విషయం అర్ధమవుతుంది. 

 

రాబోయే రెండు మూడు నెలలలో దీని తీవ్రత మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని పలువురు అంచనా వేస్తున్నారు. కరోనా తీవ్రత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది కొందరి మాట. ఈ నేపధ్యంలో నే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. కరోనా హాట్ స్పాట్ లు గా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ ని మరింత కాలం కొనసాగించే యోచనలో ఉంది కేంద్ర సర్కార్. 400 జిల్లాల్లో కరోనా ప్రభావం అసలు లేదు. దీనితో ఆయా జిల్లాల్లో లాక్ డౌన్ ని అమలు చేసే ఆలోచన చేస్తున్నారని సమాచారం. 

 

లాక్ డౌన్ ని అమలు చేయకపోతే పరిస్థితులు చాలా దారుణంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. ఇప్పుడు సినీ హీరోలు అందరి తో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వాళ్లకు కొన్ని బాధ్యతలను ఇవ్వాలి అని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్లకు కొన్ని రాష్ట్రాలు అప్పగించి వాడుకునే యోచనలో ఉన్నారు ప్రధాని.

మరింత సమాచారం తెలుసుకోండి: