కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ కొనసాగుతుంది. దాదాపు అన్ని దేశాల్లో జనజీవనం స్థంబించిపోయింది. ఈ నేపథ్యంలో పలువురు భారతీయులు ఇతర దేశాల్లో చిక్కుపోయారు. ఇతర దేశాల్లో పర్లేదు గానీ కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న అమెరికా, ఇటలీ లాంటి దేశాల్లో ఉన్న భారతీయులు భయంతో వణికిపోతున్నారు. అక్కడున్న దారుణమైన పరిస్థితులను గుర్తు చేసుకొని భయకంపితులవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ అందాల భామ తనను ఇంటికి చేర్చాలని ప్రభుత్వాన్ని వేడుకుంటుంది.

 

నటి సౌందర్య శర్మ అమెరికా లోని ఇండియన్‌ ఎంబసీ తో పాటు ఎక్స్‌టర్నల్‌ ఎఫైర్స్‌ మినిస్టరీని సంప్రదించింది. తనతో పాటు అక్కడ  చిక్కుకుపోయిన దాదాపు 400 మంది విద్యార్థులను స్వస్థలాలకు చేర్చాలన ఆమె వేడుకుంది. `ఇది ప్రతీ ఒక్కరికీ ఆపద సమయం, వందలాది విద్యార్ధులు ఇతర భారతీయులు ఇక్కడ సరైన వసతులు లేని పరిస్థితుల్లో చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో నేను ఇండియన్‌ ఎంబసీకి, విదేశీ మంత్రిత్వ శాఖను సంప్రదిస్తున్నాను . వీరిని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలన్న నా అభ్యర్థనకు సరైన రెస్సాన్స్‌ వస్తుందని ఆశిస్తున్నా` అంటూ కామెంట్ చేసింది.

 

అయితే తానే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇక్కడి విద్యార్థులను తరలించటం అయ్యే పని కాదేమో అనిపిస్తుంది. `నేను ఇండియన్‌ ఎంబసీని, విదేశీ మంత్రిత్వ శాఖను ప్రాదేయ పడుతున్నా. ఈ దేశంలో చిక్కుకున్న విద్యార్థులను ఇతర భారతీయులు ఈప్రమదకర పరిస్థితులను దాటేందుకు సహకరించండి. వీలైతే ఓ ఎవాక్యువేషన్‌ ఫ్లైట్‌ ను పంపి భారతీయులను ఇక్కడి నుంచి తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు చేయండి` అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. లాస్‌ ఏంజెల్స్‌ లోని ఓ ఇన్సిస్టిట్యూట్‌ లో యాక్టింగ్ కోర్స్ నేర్చుకునేందుకు వెళ్లిన సౌందర్య లాక్‌ డౌన్‌ కారణంగా అక్కడే చిక్కుకుపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: