అదిగో తోక అంటే ఇదిగో పులి అంటున్నారు ఇండస్ట్రీలో కొంతమంది అసలు అక్కడ విషయం ఏం లేకుండానే దాని చుట్టూ రకరకాల రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు తర్వాత ఇంతవరకూ తన నెక్ట్స్ సినిమా అనౌన్స్ చెయ్యని మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ ని ఫిక్స్ చేసేశారట మేకర్స్. అది కూడా బాలీవుడ్ హీరోయిన్ ని.
మహేష్ బాబు 3 మన్త్స్ నుంచి చిల్ అవుతున్నాడు . నెక్ట్స్ సినిమా ఏం చేద్దామా అని ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఇంతలో పరశురామ్ మహేష్ కు అంతకు ముందే స్టోరీ చెప్పాడని, ఆ స్టోరీకి మహేష్ ఛేంజెస్ చెయ్యమని చెబితే.. ఆ కథను ఇంకా చెక్కి.. మహేష్ ఇంప్రెస్ అయ్యే కథని తయారు చేశాడని .. మొత్తానికి ఆ స్టోరీకి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ నడుస్తోంది.
మహేష్- పరశురామ్ సినిమా మీద ఇప్పటి వరకూ అఫీషియల్ గా ఎలాంటి కన్ఫర్మేషన్ లేకపోయినా .. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ గట్టిగా నడుస్తోందట. అంతే కాదు ఈ సినిమాలో హీరోయిన్ కోసం కూడా సెర్చింగ్ మొదలు పెట్టారని .. ఈసారి సూపర స్టార్ కోసం మరో బాలీవుడ్ భామని ఇంపోర్ట్ చేద్దామని కూడా డిసైడ్ అయ్యారట మేకర్స్ .
బాలీవుడ్ లో మహేష్ బాబు అందానికి సరిపోయే యంగ్ అండ్ ఫ్రెఫ్ ఫేసెస్ ఎవరా అని వెతికితే .. ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా సెటిల్ అవుతున్న స్టార్ హీరో కూతురు సారా అలీఖాన్ కనిపించింది. ఇంకేముంది .. తెలుగు స్క్రీన్ కి కొత్తగా ఉంటుందని ఆ హీరోయిన్ నే ఫిక్స్ అయిపోయారు. మహేష్ బాబుతో హీరోయిన్ గా అంటే ఏ హీరోయిన్ మాత్రం నో అంటుంది అని ఓకే చెప్పిందని అనుకుంటున్నారు టాలీవుడ్ జనాలు .