బాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ రణబీర్.. ఆలియాపెళ్లి డేట్ ఫిక్స్ అయ్యింది. ఎప్పటినుంచో ప్రేమాయణం నడుపుతున్న ఈ ప్రేమజంట ఒక్కటవ్వబోతున్నారు. నిజానికి ఈ సమ్మర్లోనే వీళ్ల పెళ్లి బాజా మోగుతుందని బాలీవుడ్ లో వార్తలు నడిచాయి.
 
రణబీర్ .. తో ఎక్కువ కాలం గర్ల్ ఫ్రెండ్ గా ఉండి పెళ్లి వరకూ తీసుకొచ్చిన హీరోయిన్ ఆలియా అనే చెప్పాలి. రణబీర్ కి అంతకు ముందు చాలా మంది హీరోయిన్లతో  ఎఫైర్ ఉంది.కానీ అవేవీ పెళ్లి వరకూ రాలేదు. ముఖ్యంగా ఈ రిలేషన్ షిప్స్ మీద కాన్సన్ ట్రేట్ చేసి కెరీర్ మీద పెద్దగా ఫోకస్ చెయ్యలేదని కూడా బాలీవుడ్ లో టాక్.

 

కత్రినా కైఫ్, దీపికా లాంటి స్టార్ హీరోయిన్లతో లవ్ ట్రాక్ నడిపిన రణబీర్ ఇప్పుడు ఆలియాతో సెట్ అయ్యాడు. కొన్నాళ్ల నుంచి లవ్ లో ఉన్న వీళ్లిద్దరూ ఇప్పుడు పెళ్లి పీట లెక్కబోతున్నారు. ఈ సంవత్సరం డిసెంబర్ 20 తర్వాత వీళ్ల పెళ్లి జరగతోందని ఆలియా బెస్ట్ ఫ్రెండ్ ఆకాంక్ష రంజన్ కపూర్ చెప్పింది. 

 

నిజానికి ఫస్ట్ వీళ్లిద్దరిపెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ అనుకున్నారు. కానీ.. ఇప్పుడు మాత్రం ముంబై లోనే బాండ్ బాజా బారాత్  స్టైల్లోనే పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యారు . డిసెంబర్ లాస్ట్ 10 రోజులు పెళ్లి హడావిడి, ఫంక్షన్స్ అన్నీ జరపాలని ప్లాన్ చేస్తున్నారట రణబీర్,ఆలియా పేరెంట్స్ . 

 

రణబీర్ , ఆలియా ఇద్దరూ ప్రస్తుతం బ్రహ్మాస్త్ర సినిమాలో కలిసి నటిస్తున్నారు. స్టార్ కాస్ట్ తో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ఫస్ట్ పార్ట్ ని డిసెంబర్ 4 నే రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది డైరెక్టర్ అయాన్ ముఖర్జీ టీమ్. ఈ రిలీజ్ పనులు కూడా అయిపోయాక ఇక బిందాస్ గా పెళ్లి చేసుకుంటారన్న మాట ఈ జంట.

మరింత సమాచారం తెలుసుకోండి: