కింగ్ అక్కినేని నాగార్జున సూపర్ హిట్ సినిమాల్లో ‘సోగ్గాడే చిన్నినాయన’ ఒక ప్రత్యేకమైన సినిమా అని చెప్పొచ్చు. 2015 లో విడుదలైన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది. సంక్రాంతి బరిలో నిలిపి 'పండగకి వస్తున్నాం.. కొడుతున్నాం..' అని చెప్పి మరీ బ్లాక్ బస్టర్ కొట్టాడు నాగ్. నాగార్జున రెండు పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ చిత్రంలో నాగార్జున చేసిన ‘బంగార్రాజు’ పాత్రకు విశేషమైన స్పందన వచ్చింది. న్యూ టాలెంట్ ని ఎప్పుడు ఎంకరేజ్ చేసే నాగ్ ఈ సినిమా ద్వారా కళ్యాణ్ కృష్ణ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేసాడు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జునే స్వయంగా నిర్మించారు. ఆ సినిమా హిట్ కావడంతో నాగార్జుననాగ చైతన్య కలయికలో ఆ సినిమానికి సీక్వెల్ తీయబోతున్నారనే ఎప్పటినుండో ఇండస్ట్రీ వర్గాల్లో చర్చిస్తూ వస్తున్నారు. ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ కూడా ఇప్పటికే కథ సిద్ధం చేసాడట. ఇప్పటికే ప్రారంభం కావలసిన ఈ సినిమా కరోనా వైరస్ పరిస్థితుల కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఇప్పుడు లేటెస్టుగా ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ కాబోతోందని అప్డేట్ వచ్చేసింది. 

 

IHG

 

'బంగార్రాజు' సినిమా ఆగష్టు మొదటి వారంలో ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. షూటింగ్ స్టార్ట్ చేసి జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేసి క్రిష్టమస్ కి 'బంగార్రాజు' సినిమాని రిలీజ్ చేయాలని కింగ్ నాగ్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ కూడా నటించబోతుందట. మరి నాగ్ ఈ సీక్వెల్ ద్వారా మరో సారి హిట్ కొడతారేమో చూడాలి. అయితే గత సినిమా రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన `మ‌న్మ‌థుడు 2′ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరించింది. దాంతో నాగార్జున తన తరువాత సినిమాల విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం 'వైల్డ్ డాగ్' అనే సినిమాలో నటిస్తున్నాడు నాగార్జున. ఈ చిత్రం ద్వారా సోలొమాన్ అనే మరో కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడు కింగ్ నాగ్. కెరీర్ ప్రారంభం నుండి సక్సెస్ ఫుల్ దర్శకుల వెనుక పరుగులు తీయకుండా ఇండస్ట్రీకి న్యూ టాలెంట్ ని పరిచయం చేస్తూ వస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మ లారెన్స్, కళ్యాణ్ కృష్ణ, వైవీయస్ చౌదరీ, దశరథ్, కిరణ్ కుమార్ మొదలైన డైరెక్టర్లు నాగార్జున పరిచయం చేసిన వాళ్ళే. 

 

IHG'వైల్డ్ డాగ్' ఫస్ట్ ...

మరింత సమాచారం తెలుసుకోండి: