టాలీవుడ్ లో బాలకృష్ణ సినిమాలకు ఈ మధ్య కాలంలో ఆదరణ తగ్గింది అనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఆయన సినిమాల కోసం ఒకప్పుడు ఎదురు చూసిన వాళ్ళు ఇప్పుడు చూడటం లేదు అనేది కొందరి మాట. ఇక బాలకృష్ణ కూడా పెద్ద పెద్ద సినిమాలు చేయకుండా కథ గురించి అంత ఆలోచన చేయకుండా జాగ్రత్తగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మన తెలుగులో సీనియర్ హీరోలు అందరిలో బాలకృష్ణ కు మాత్రమే క్రేజ్ తగ్గింది. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక వార్త బయటకు వస్తుంది. 

 

తనకు గతంలో ఫ్లాప్ ఇచ్చిన కొందరు దర్శకులతో ఆయన మళ్ళీ సినిమాలు చెయ్యాలి అని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే క్రిష్ తో ఆయన సినిమా చేయడానికి సిద్దంగా ఉన్నారని టాలీవుడ్ లో ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అసలు విషయం ఏంటీ అంటే... క్రిష్ తో ఆయన సినిమా చేయడానికి సెంటిమెంట్ కారణం అని సమాచారం. బాలకృష్ణ కు క్రిష్ తో ఒక సెంటిమెంట్ ఉందని టాక్. ఫ్లాప్ అయిన తర్వాత ఆయనతో సినిమా చేస్తే హిట్ అవుతుందని... గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా విషయంలో ఇదే జరగడం తో బాలకృష్ణ ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నారు. 

 

బాలయ్య వందో సినిమాగా ఆ సినిమా వచ్చింది. అంతకు ముందు 99 వ సినిమా ఫ్లాప్ అయింది. అందుకే ఇప్పుడు వరుస ఫ్లాప్ సినిమాలతో ఇబ్బంది పడుతున్న బాలకృష్ణసినిమా మీద ఎక్కువగా ఫోకస్ చేసారని క్రిష్ ఇప్పటికే కథ కూడా రెడీ చేసారని పవన్ తో సినిమా తర్వాత వెంటనే ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే ఆలోచన చేస్తున్నారని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. కథను రెడీ చేసి బాలకృష్ణ కూడా వినిపించారని సమాచారం. అది బాలయ్య కు కూడా నచ్చిందని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: