ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రజలంతా ఒక్కటవుతున్నారు. కుల, మత, వర్గ, ప్రాంతం.. అనే తేడాల్లేకుండా ఇతోధిక సాయం చేస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు. ఎందరో తమకు ఉన్నదాంట్లో ప్రభుత్వాలకు సాయం చేస్తున్నారు. మరి కొందరు సరుకులు, అన్నదానం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ విపత్తు సమయంలో నిబద్ధతగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు కూడా సాయం అందిస్తున్నారు.

 

 

ఇందుకు ఉదాహరణగా.. ఓ మహిళ తన స్థోమత కంటే ఎక్కువగా ఆలోచించి చేస్తున్న సాయం ఇంటర్నెట్ లో వైరల్ అయింది. ఇటివల ఎండలో ఉంటూ.. పరిస్థితులు అదుపుతప్పకుండా పహారా కాస్తున్న పోలీసులకు ఓ మహిళ కూల్ డ్రింక్ బాటిళ్లను ఇవ్వడం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. పెప్సి, ఫాంటా డ్రింక్ బాటిల్స్ ను పోలీసులకు దాహం ఇవ్వగా పోలీసులు వారించారు. పనికి వెళ్తూ నెలకు 3500 సంపాదించే ఆ మహిళ దాతృత్వానికి చలించిపోయిన పోలీసులు ఆమెకు కృతజ్ఞతలు చెప్పారు. ఆమెను వారించి తమ దగ్గరున్న డ్రింక్ బాటిల్ నే ఆమెకు ఇచ్చి ఇంట్లో పిల్లలకు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అయింది.

 

 

ఈ వీడియోను దర్శకుడు హరీశ్ శంకర్ పోస్ట్ చేశాడు. ‘వీళ్లతో పోలిస్తే మనం చేసేది చాలా తక్కువ. We shall do more’ అని తన వాల్ లో రాసుకున్నాడు. ఆ మహిళపై నెటిజన్లు ప్రసంశలు కురిపిస్తున్నారు. ఈ మహిళ మానవత్వం అందరినీ కదిలిస్తోంది. ఇటువంటి వీడియోలు చూసి మరింత మంది ప్రభావితం అవుతున్నారు. ప్రత్యక్షంగా కాకపోయినా చారిటీ చేస్తున్న వారికి తమ వంతుగా నిత్యావసరాలు అందిస్తున్నారు. ఈ ఆపత్కాలంలో ప్రతి ఒక్కరూ సాయం చేయడానికి ముందుకు రావడం, ఆదుకోవడం శుభ పరిణామం అని చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: