కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న లాక్ డౌన్ లాంటి కొన్ని అనివార్య నిర్ణయాల వలన పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే వారందరి కోసం అండగా నిలిచేందుకు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ప్రధాని నరేంద్ర మోడీ ఏర్పాటుచేసిన పీఎం కేర్స్ ఫండ్ కి విరాళంగా డబ్బులు ఇచ్చింది కానీ ఎంత ఇచ్చిందో మాత్రం వెల్లడించలేదు. ఆమె మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే రిలీఫ్ ఫండ్ కి కొంత డబ్బును విరాళంగా ఇచ్చినట్లు తెలిపింది.


ఈ విషయాన్ని గత సోమవారం నాడు ఆమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తెలిపింది. 'నేను మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కి, ప్రధాన నరేంద్ర మోడీ పీఎం కేర్స్ ఫండ్ కి విరాళాలు అందజేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. కరోనా మహమ్మారి ప్రపంచంపై చూపిస్తున్న భయంకరమైన ప్రభావం నన్ను ఎంతో బాధిస్తోంది' అని ఆమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో రాసుకొచ్చారు.


కత్రినాకైఫ్ కంటే ముందుగానే బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన భర్త విరాట్ కోహ్లీతో కలిసి ప్రధాన నరేంద్ర మోడీ ఫండ్ కి విరాళం ఇచ్చింది కానీ ఎంత ఇచ్చిందో మాత్రం ప్రకటించలేదు. బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్ 25వేల పేద ప్రజలకు ఆహారాన్ని అందిస్తానని ప్రకటించి అందరి మన్ననలను పొందారు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పవన్ కళ్యాణ్, ప్రభాస్, చిరంజీవి, రామచరణ్, మహేష్ బాబు ఇంకా తదితరులు పేద ప్రజల కోసం కోట్ల రూపాయలలో విరాళాలు ఇచ్చారు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఏకంగా రూ.25 కోట్లను ప్రధాన నరేంద్ర మోడీ యొక్క పీఎం కేర్స్ ఫండ్ కి విరాళం గా ఇచ్చి దేశవ్యాప్తంగా అందరి ప్రశంసలను అందుకున్నారు. చిన్నపాటి సినీ ప్రముఖులు కూడా తమకు చేతనైనంత సాయం చేస్తూ పేద ప్రజల ఆకలి తీర్చేందుకు ముందుకు వస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: